English | Telugu
యష్ - వేదల పెళ్లి.. మాళవికకు తెలిసిపోతుందా?
Updated : Feb 2, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. నిరంజన్, డెబ్జాని మోడక్ ప్రధాన పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కొత్త జంటని టీవీ వీక్షకులకు పరిచయం చేసింది. సరికొత్త కథ, కథనాలతో ఆద్యంతం ఆసక్తికర మలుపులతో ఈ సీరియల్ సాగుతోంది. జన్మలో పిల్లలు పుట్టని వేద ..యష్ కూతురు ఖుషీని ప్రేమగా చూసుకుంటుంటుంది. అదే ఇద్దరిని దగ్గర చేస్తుంది.
అయితే ఈ బంధాన్ని శాశ్వతం చేయాలని వేద తండ్రి అయ్యర్, యష్ తండ్రి రత్నం ఆలోచిస్తారు. ఇద్దరికి పెళ్లి చేయాలని భావిస్తారు. అయితే వీరి పెళ్లికి అయ్యర్ భార్య సులోచన, రత్నం వైఫ్ మాలిని అడ్డు చెబుతారు. ఆ తరువాత ఇద్దరిని ఒప్పించి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేస్తారు. ఇదిలా వుంటే వేదతో కలిసి యస్ రిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళతాడు. అక్కడే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు. కానీ అది వేదకు ఇష్టం వుండదు. ఇంట్లో వాళ్ల అంగీకారంతోనే పెళ్లి చేసుకుందామంటుంది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు మొదలవుతాయి. దీంతో అక్కడి నుంచి తిరిగి ఇంటికి పయనమవుతారు.
Also Read:కలర్‌ఫుల్ స్విమ్‌సూట్‌లో సెగలు రేపుతున్న 'మాస్టర్' హీరోయిన్!
ఈ విషయం యష్ మాజీ భార్య మాళవిక కంటపడుతుంది. ఈ ఇద్దురు రిజస్ట్రేషన్ ఆఫీసులో ఏం చేస్తున్నారని ఆరా తీయడం మొదలుపెడుతుంది. వెంటనే వేదకు ఫోన్ చేస్తే తను వేరే చోట వున్నానని, ఇప్పుడు కలవలేనని అబద్ధం చెబుతుంది. దీంతో మాళవికలో అనుమానం మొదలవుతుంది. ఏం జరుగుతోంది? .. వేద ఎందుకు అబద్ధం చెబుతోంది. ఇంతకీ యష్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు? అంటూ మాళవిక ఆలోచనలో పడుతుంది. కట్ చేస్తే యష్ ఇంట్లో వేద తల్లిదండ్రులు సంబంధం మాట్లాడుతుంటారు. అదే సమయంలో యష్, వేద ఇంటికి తిరిగి వస్తారు? ఆ తరువాత ఏం జరిగింది? .. యష్.. వేదలు ఏం చెప్పారు? ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మాళవికకు తెలిసిపోతుందా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.