English | Telugu

Jayam serial : గంగకి భాద్యతలు అప్పగించిన పెద్దసారు.. ఇషిక జెలసీ!


జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ -135 లో...... గంగ సూపర్ మార్కెట్ కి వెళ్లి తన ఐడియాని షేర్ చేస్తుంది. దాంతో అందరు ఇంప్రెస్ అవుతారు. పెద్దసారు ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో అదే చెప్తాడు. గంగని సూపర్ మార్కెట్ కి ఓనర్ ని చెయ్యాలని చెప్తాడు. కోడలిగా ఇష్టం లేదంటే బిజినెస్ అప్పగిస్తాను అంటారేంటి అని శకుంతల కోప్పడుతుంది.


ఎక్కడ తనకి బాధ్యతలు అప్పగిస్తారోనని ఇషిక జెలస్ గా ఫీల్ అవుతుంది. అయినా తనకి బాక్సింగ్ కెరీర్ ఉంది కదా మళ్ళీ ఇది ఎందుకని అంటుంది. గంగ మల్టీ ట్యాలెంటెడ్. నువ్వు ఈ ఇంటి కోడలిగా ఎలా బిజినెస్ చూసుకుంటున్నావో తను కూడా చూసుకోవాలని పెద్దసారు అంటాడు. ఆ తర్వాత ఇందుమతి తన భర్త ఏదో ఫంక్షన్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుంటుంటే అప్పుడే శకుంతల వచ్చి ఏమైందని అడుగుతుంది. నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుకి పెళ్లి అయింది తన కోడలిని అందరికి పరిచయం చెయ్యాలని ఫంక్షన్ ఏర్పాటు చేసిందని ఇందుమతి చెప్తుంది.

అలా కూడా చెస్తారా అని వంశీ అడుగుతాడు. చేస్తారు.. కొత్తకోడలిని అందరికి పరిచయం చేస్తారు. కోడలు మేలిముసుగులో ఉంటుంది. తన భార్యకి భర్త బాధ్యతలు అప్పగిస్తాడని ప్రమీల అంటుంది. గంగకి ఎందుకు చెయ్యాలేదు గంగకి కూడా చెయ్యాలని పెద్దసారు అంటాడు.

నాకు పారు కోడలిగా వస్తే అన్ని చేసేదాన్ని అని శకుంతల అంటుంది. ఇప్పుడు గంగకి కూడా చెయ్యాలి.. ప్రీతీ వెళ్లి గంగని రెడీ చెయ్యండి అని పెద్దసారు పంపిస్తాడు. శకుంతల కోపంగా వెళ్తుంది. అత్తయ్యకి ఇష్టం లేదని ప్రమీల అనగానే తనతో ఎలా చేయించాలో నాకు తెలుసని పెద్దసారు అంటాడు. గంగ వదినలాగే ఉండొచ్చు కదా ఇషిక.. బాధ్యతలు తీసుకున్నావ్.. నువ్వు కూడా నాతో బాగా ఉండొచ్చు కదా అని సూర్య అనగానే నాకు కంపేరిజన్ వద్దని ఇషిక అంటుంది.

అమ్మ ప్రమీల కాఫీ నాతో పాటు సూర్యకి కూడా అని పెద్దసారు అంటాడు. మరొకవైపు గంగని ప్రీతీ వాళ్ళు రెడీ చేస్తారు. నువ్వు ఇప్పుడే అన్నయ్య మొహం చూడకూడదని వాళ్ళు చెప్తారు. ఒకరికొకరు చూసుకోకుండా వంశీ, సూర్య రూమ్ బయట కాపలా ఉంటారు. అప్పుడే రుద్ర వచ్చి మీరేంటి ఇక్కడ అని అడుగుతాడు. అయితే వాళ్ళు అసలు విషయం చెప్తారు. గంగకి రుద్ర ఏం బాధ్యతలు అప్పగించాడో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.