నా భర్త కూడా సమంత హాట్ గా ఉందన్నాడు!
on Jan 31, 2022

'పుష్ప' సినిమాలోని 'ఊ అంటావా మావ' సాంగ్ తో సమంత సెన్సేషన్ క్రియేట్ చేసింది. కెరీర్ లో సమంత మొదటి సారిగా చేసిన ఈ స్పెషల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ చూసినా ఈ సాంగ్ మారుమోగిపోతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ సాంగ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఈ సాంగ్ లో సమంత గ్లామర్ కి సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. తాజాగా హీరోయిన్ ప్రియమణి ఈ సాంగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సాంగ్ లో తనకే కాదు.. తన భర్తకి కూడా సమంత హాట్ గా కనిపించింది అంటూ ప్రియమణి హాట్ కామెంట్స్ చేసింది.
'భామా కలాపం' మూవీతో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్న ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సమంత, నయన తార వంటి హీరోయిన్స్ కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ రాణిస్తున్నారని తెలిపింది. ఈ సందర్భంగా ఊ అంటావా మావ సాంగ్ ప్రస్తావన రాగా ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

"ఊ అంటావా మావ సాంగ్ యూట్యూబ్ లో మారుమోగిపోతుంది. సమంత మొదటి సారి ఇలాంటి సాంగ్ లో నటించింది. ఈ పాటను ఎంచుకున్నందుకు సమంతకి అభినందనలు. ఈ సాంగ్ లో ఆమె చాలా హాట్ గా కనిపించింది. నా భర్త కూడా ఇదే మాట అన్నాడు. సోషల్ మీడియాలో ఈ సాంగ్ ట్రెండ్ అవుతుంది.. ఎంతోమంది సమంత వేసిన స్టెప్పులను ట్రై చేస్తున్నారు" అని ప్రియమణి చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



