English | Telugu

యష్మీ, పృథ్వీల నిజస్వరూపాన్ని బయటపెట్టిన హరితేజ!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పుడు కొత్త రంగులను పులుముకుంది. హౌస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఎంటర్‌టైన్మెంట్ మాములుగా లేదు. వచ్చీ రాగానే ఎక్స్ కంటెస్టెంట్స్ ఇచ్చే ఫన్ అండ్ కంటెంట్ కి ఆడియన్స్ వారికి కనెక్ట్ అయ్యారు.‌ ఎనిమిది మంది వస్తే ఒక్కరు ఇద్దరు తప్ప అందరు తమ బెస్ట్ ఇస్తున్నారు.

ఇక సోమవారం హౌస్ లో‌ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ‌ఏదీ వదలకుండా ప్రతీ పాయింట్ ని క్లియర్ గా చెప్తూ వైల్డ్ కార్డ్స్ నామినేషన్ చేస్తుంటే.. బిగ్ బాస్ చూసే ఆడియన్ అడిగినట్టుగా ఉంది. చాలా రోజుల తర్వాత ది బెస్ట్ డే ఇన్ బిగ్ బాస్ అనిపించేలా నిన్నటి ఎపిసోడ్ సాగింది. ఐదు వారాల మీ ప్రయాణాన్ని, మీ ఆటతీరు, మీ స్వభావాన్ని ఆడియన్స్‌లాగ చూసి వైల్డ్ కార్డ్స్ ఇక్కడికి వచ్చారు.. కనుక మీపై వారికి ఓ స్పష్టమైన అభిప్రాయం ఉండి ఉంటుంది.. కనుక ఈసారి నామినేషన్స్ రాయల్ క్లాన్ మాత్రమే చేస్తారు.. మీకు ఎవరు అనర్హులని భావిస్తే వాళ్లలో ఇద్దరూ ఓజీ క్లాన్ సభ్యులను నామినేట్ చేయాలి.. మెగా చీఫ్ అయిన కారణంగా నబీల్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదు.. అంటూ బిగ్‌బాస్ అనౌన్స్ చేశాడు.

మొదటిగా యష్మీని నామినేట్ చేసింది హరితేజ. తన కారణాలు చెప్పింది.. మీరు హౌస్‌లో చెప్పేది ఒకటే చేసిది ఒకటి.. పర్సన్ పర్సన్‌కి మీ రూల్స్ మారుతున్నాయి.. మీకు మంచి రిలేషన్ ఉన్నవాళ్ల దగ్గర మీకు రూల్స్ ఏం ఉండవు.. ఇక ప్రతివారం ఒక మనిషిని టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడం ఒక స్ట్రాటజీలా పెట్టుకున్నట్లు ఉంది.. అయితే అలా రిపీటెడ్‌గా ఒకరినే నామినేట్ చేయడం వల్ల వేరే ఒక అనర్హుడైన వ్యక్తిని నామినేట్ చేయకుండా మీరు సేవ్ చేస్తున్నారు.. ఇక నన్ను హర్ట్ చేశావ్.. అందుకే నామినేట్ చేస్తున్నా అంటూ ప్రతి వారం చెప్పడం వల్ల అది న్యాయంగా అనిపించడం లేదు.. అలాగే బోర్‌గా ఉంది.. ఇక మొన్న ఫ్యామిలీ పంపిన ఫుడ్ విషయంలో మీరు అది మణికంఠకి ఇచ్చి ఉంటే బావుండేదనిపించింది. మీకు ఇష్టమైన వాళ్లవి ఎమోషన్స్ మిగిలిన వాళ్లవి కాదనేటట్టుగా ఉంది మీ బిహేవియర్ అంటూ యష్మీ తిరిగి మట్లాడకుండా చేసింది హరితేజ. ఆ తర్వాత తన సెకెండ్ నామినేషన్ గా పృథ్వీని నామినేట్ చేసింది హరితేజ. మీరు టాస్కులు ఆడేటప్పుడు స్ట్రెంత్‌తో.. అలానే కాస్త పొగరుగా కూడా ఆడతారు.. అయితే మీరు మెగా చీఫ్ టాస్క్ జరిగినప్పుడు 'ఐ' పక్కన గ్యాప్ ఉండాలా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోలేకపోయారు.. పక్కన వాళ్లు ఏమంటే దానికి ఊ కొట్టేసి ఆడారు.. అంత ముఖ్యమైన టాస్కులో మీ డెసిషన్ మీరు తీసుకొని ఉంటే బావుండేది.. ఇలా పక్కవాళ్లు చెప్పిన దానికి ఇన్ ఫ్లూయెన్స్ అయిపోతే మీ గుర్తింపు ఎక్కడ ఉంటుంది.. అలానే టాస్కులు తీసెస్తే మీరేంటి అనేది పెద్దగా కనిపించడం లేదంటూ హరితేజ చెప్పింది. ఇక హరితేజ చెప్పిన పాయింట్లకి యష్మీ, పృథ్వీల నోట మాట రాలేదు. ఫస్ట్ ఓవర్ లో మొదటి రెండు బంతులకి రెండు సిక్సర్లు కొట్టినంతంగా హరితేజ చేసిన ఈ నామినేషన్లు అనిపించాయి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.