English | Telugu

అభయ్ నవీన్.. బూతు పురాణం!

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు పెరిగే కొద్దీ కంటెస్టెంట్స్ మధ్య ఫుల్ గొడవలు జరుగుతున్నాయి. ఈ వారం మొదలైన అన్ని టాస్క్ లలో కంటే ప్రభావతి 2.0 టాస్క్ లో హౌస్ మేట్స్ మధ్య తీవ్రమైన ఆర్గుమెంట్స్ జరుగుతున్నాయి. సోనియా, నిఖిల్, పృథ్వీ కలిసి ఆడే ఆటలో మిగిలిన వాళ్ళంతా మానసికంగా బాధపడుతున్నారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు అభయ్ నవీన్ చేరాడు. అసలేం జరిగిందో‌ ఓసారి చూసేద్దాం.

నిన్న హౌస్ లో బిగ్ బాస్ కొన్ని రూల్స్ చెప్పాడు. కంటెస్టెంట్స్ అందరిని సోఫాలో‌ కూర్చోబెట్టి.. బిగ్‌బాస్ ఇంటి కిచెన్‌లో ఇక నుంచి ఒక కొత్త రూల్ వచ్చింది. కిచెన్‌లో ఒక్క సమయంలో ఒక్క టీమ్ మాత్రమే వంట చేయాలి. అలానే ఒక టీమ్ వంట చేసేటప్పుడు ఆ టీమ్‌కి సంబంధించిన ముగ్గురు మాత్రమే కిచెన్‌లో ఉండాలి. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో మీరు కూరగాయలు కోయడం కూడా లెక్కలోకి తీసుకుంటామంటూ బిగ్‌బాస్ చెప్పాడు. ఇది విన్న వెంటనే కంటెస్టెంట్ల ముఖాలన్నీ మాడిపోయాయి. ఇక కాంతార చీఫ్ అభయ్ అయితే మనిషి పుట్టుక పుట్టారా లేదా అసలు ఈ రూల్స్ రాసినోళ్లు.. అంతమందికి ముగ్గురు ఎలా వండుతారా ధమాక్ లేదు మీకు.. తినడానికి టాస్కులు పెడుతున్నారా లేక తినకుండా ఉండటానికి పెడుతున్నారా.. నీయమ్మా సైకోగాళ్లు.. పిచ్చి రూల్స్.. సైకోగాడు బిగ్‌బాస్ అంటూ రెచ్చిపోయాడు.

ఇక ప్రభావతి ఎగ్స్ టాస్క్ లో అభయ్ నవీన్ చేతులెత్తేశాడు. వాళ్ళ టీమ్ అంతా ఎగ్స్ కోసం కష్టపడుతుంటే ఏం పట్టనట్లు కూర్చున్నాడు. ఇది చూసి బిబి ఆడియన్స్ అతడిని ట్రోల్స్ చేస్తున్నారు. ఈట్ ఫై స్టార్ డూ నథింగ్ అనే క్యాప్షన్ పెట్టి అభయ్ ఖాళీగా కూర్చొని ఉన్న ఫోటోని ఆడ్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. బెలూన్స్ టాస్క్ లో నిఖిల్ కి ఫెయిర్ గా సోనియా రిజల్ట్స్ చెప్పడంతో అలిగిన అభయ్.‌. కోపంతో బిగ్ బాస్ పెట్టే ఏ టాస్క్ ఆడనని ఫుల్ ఫ్రస్టేషన్ తో చెప్పాడు. ఇక మరోవైపు వాళ్ళ టీమ్ లోని ఆదిత్య, ప్రేరణ, నబీల్, యష్మీ, మణికంఠ అంతా కలిసి ఛీఫ్ లేకుండా సరైన గేమ్ ని ఆడలేకపోతున్నారు. ఈ లెక్కన చూస్తే ఈ వారం అభయ్ కి ఓటింగ్ కూడా తక్కువే ఉండేలా ఉంది. మరి హౌస్ లో అభయ్ ఇలా ఉండటం ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.