English | Telugu
అభిమన్యు - మాళవికలకు దిమ్మదిరిగే షాకిచ్చిన వేద
Updated : Mar 5, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. గత కొన్ని వారాలుగా వీక్షకులని ఈ సీరియల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. యశోధర్ - వేదల పెళ్లి ఆగిపోయిందన్న ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమన్యు, మాళవిక పార్టీ కి వెళతారు. కట్ చేస్తే వేద - యష్ ల పెళ్లి జరిగిపోతుంది. మాళవిక మోసం చేస్తోందని, పెళ్లి ఆపాలనే కుట్రలో భాగంగానే ఇలా చేసిందని ఖుషీ చెప్పడంతో వేద రియలైజ్ అయి యష్ ని పెళ్లి చేసుకుంటుంది. జరగదనుకున్న పెళ్ళి జరగడంతో ఇరు కుటుంబాలు హ్యాపీ మోడ్‌లోకి వెళ్లిపోతారు.
యష్ - వేదలు ఊరేగింపుగా బయలుదేరి అపార్ట్‌మెంట్ కి చేరతారు. అయితే కొత్త జంట గృహ ప్రవేశం పేరుతో ఇరు కుటుంబాల మధ్య సరదా సంభాషణ మొదలవుతుంది. మా ఇంట్లోకి రావాలంటే మా ఇంట్లోకి రావాలంటూ ఇరు కుటుంబాల వారు పోటీపడుతుంటారు. ఇంతో మంచి ముహూర్తం మించిపోతోందని పూజారి అనడంతో వేద - యష్ ... యష్ ఇంటిలోకి వెళుతుంటారు. ఈ లోగా యష్ సోదరి ఎంట్రీ ఎదురొచ్చి ఒకరి పేరు ఒకరు చెబితేనే ఇంట్లోకి ఎంట్రీ అంటుంది. ఇక్కడ కూడా యష్ - వేదల మధ్య గిల్లికజ్జాలు మొదలవుతాయి. చివరికి యష్ వేదతో పాటు తన ఇంటివారి పేర్లు కూడా చెప్పడంతో అంతా ఆనందిస్తారు. వేద కూడా యష్ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చెప్పి ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
ఆ తరువాత కలిసి ఒకే విస్తరాకులో యష్ - వేద భోజనం చేయాలంటారు. నేను చేయనంటే నేను చేయనంటూ యష్ - వేద మొండికేస్తారు. కట్ చేస్తూ నో టచ్చింగ్స్ అంటూనే ఒకరికి ఒకరు తినిపించుకుంటారు. ... యష్ - వేదల పెళ్లి ఆగిపోయిందని పార్టీలో పీకల దాకా తాగి ఎంజాయ్ చేసిన అభిమన్యు మాళవికతో కలిసి ఇంటికి చేరతాడు. అదే సమయంలో ఖుషీ ఆయమ్మ ఇంటికి చేరతారు. ఎక్కడికి వెళ్లారని మాళవిక -అభిమన్యు ఆయమ్మని నిలదీస్తారు. కానీ తను నిజం చెప్పదు... అయితే ఎక్కడో ఏదో తప్పు జరుగుతోందని అభిమన్యు శంకించడం మొదలుపెడతాడు.
విషయం తెలిపసి నన్నుఎందుకు మోసం చేశావని మాళవిక .. వేదను నిలదీస్తుంది. ఖుషీని దక్కించుకోవడం కోసమే ఇదంతా చేశానని వేద.. మాళవికకు దిమ్మదిరిగే షాకిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.