English | Telugu

మెగా చీఫ్ గా విష్ణుప్రియ.. అంతఃకరణ శుద్దితో ఉండగలదా!

బిగ్ బాస్ సీజన్-8 లో ఎన్నడు లేని విధంగా టాస్క్ లు డిఫరెంట్ గా ఎంటర్‌టైన్మెంట్ తో ఉన్నాయి. మెగా చీఫ్ టాస్క్ కంటెండర్ షిప్ లో భాగంగా బీబీ రాజ్యంలో వారంలో ఏడు టాస్క్ లు జరిగాయి. అందులో ఎక్కువ టాస్క్ లు ఓజీ క్లాన్ వాళ్ళు గెలిచి ఒక్కొక్క టాస్క్ గెలిచి ఒక్కక్కరు గా కంటెండర్ షిప్ కి అర్హత సాధించారు.

రాయల్స్ క్లాన్ నుండి రోహిణి, టేస్టీ తేజలు కాగా.. ఓజీ క్లాన్ నుండి పృథ్వీ, విష్ణుప్రియ, నిఖిల్, ప్రేరణ లు అయ్యారు. అయితే చివరగా అందరి కంటెండర్స్ కి మెడలో పూలమాల ఉంటుంది. బజర్ మొగినప్పుడల్లా మిగతా హౌస్ మేట్స్ మిరపకాయని ఎవరైతే ముందుగా వెళ్లి పట్టుకుంటారో వాళ్ళు కంటెండర్ గా అనర్హులని భావించిన వారికి పూలదండ తీసీ మిరపకాయ దండ వేసి తొలగించాలని బిగ్ బాస్ చెప్పాడు. రాయల్స్ క్లాన్ వాళ్ళు ఓజీ వాళ్ళని.. ఓజీ క్లాన్ వాళ్ళు రాయల్స్ వాళ్ళని తొలగించగా చివరగా విష్ణుప్రియ, నిఖిల్ ఉన్నారు.

ఆ తర్వాత గౌతమ్ మిరపకాయని పట్టుకొని.. నాకు ఈ వీక్ లేడీ మెగా చీఫ్ అవ్వాలని ఉందంటూ నిఖిల్ మెడలో ఉన్న పూలమాల తీసి మిరపకాయ దండ వేస్తాడు. విష్ణుప్రియని మెగా చీఫ్ గా బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఆ తర్వాత విష్ణుప్రియ ఎన్వలప్ లో రెండు లక్షల అమౌంట్ ఉంటుంది. అది ప్రైజ్ మనీ కి ఆడ్ అయ్యింది. ఇక మెగా ఛీఫ్ అయ్యాక విష్ణుప్రియ సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా ' భరత్ అనే నేను ' సినిమాలోని డైలాగ్స్ కాపీ పేస్ట్ చేసింది. అటు రాయల్స్ క్లాన్, ఇటు ఓజీ క్లాన్ అని కాకుండా అందరికి సమన్యాయం చేస్తానని అంతఃకరణ శుద్దితో ప్రమాణం చేస్తున్నానని విష్ణుప్రియ అంది. ఇక హౌస్ మేట్స్ అంతా చప్పట్లోతో అభినందనలు తెలిపారు. ఇక ఈ వారం మెగా చీఫ్ గా విష్ణుప్రియ పర్ఫామెన్స్ ఎలా ఉంటుందో చూడాలి మరి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.