English | Telugu
బిగ్ బాస్ హౌస్ లో....విష్ణు ప్రియ లవ్ ప్రపోజల్
Updated : Sep 4, 2024
బిగ్‌బాస్ అంటేనే లవ్, గొడవలు, స్నేహం, ఇలాంటివి లేకపోతే చూసే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ ఏముంటుంది. ఒకవేళ వాళ్లకి ఆ ఆలోచనే లేకపోయిన బిగ్ బాస్ క్రియేట్ చేసి మరీ ఓ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీని ప్రొజెక్ట్ చేస్తాడు.
గత సీజన్‌లో ఇలానే పల్లవి ప్రశాంత్, రతిక రోజ్‌ల మధ్య రోజాపూలతో ఓ మంచి లవ్ స్టోరీ ప్లాన్ చేశాడు. కానీ అది సెట్ అవ్వలేదు. ఈ సీజన్‌కి మాత్రం అందుకు కావాల్సినన్ని అరేంజ్‌మెంట్‌లు ముందే రెడీ చేసి పెట్టుకున్నాడు బిగ్‌బాస్. ఎందుకంటే ఓవైపు సీరియస్‌గా కంటెస్టెంట్లు నామినేషన్ల ప్రక్రియలో బూతులు, తిట్లలో మునిగి తేలిపోతుంటే అందులో నుంచి, ఆ మధ్య వచ్చిన బ్రేకులో నుంచి ఓ లవ్ స్టోరీని చూపించాడు బిగ్ బాస్. నామినేషన్లకి చిన్న బ్రేక్ దొరకడంతో కిచెన్ దగ్గరికెళ్లి కాఫీ అడిగాడు పృథ్వీ. దీంతో తన చేతిలో కప్పు తీసి కాఫీ కలిపి మరీ ఇచ్చింది విష్ణుప్రియ. కాఫీతో పాటు ఓ ప్రపోజల్ కూడా పెట్టిందండోయ్. "నేను కుక్ చేసి ఇస్తా కదా నన్ను ప్రేమించొచ్చు కదా.." అంటు విష్ణుప్రియ క్యూట్‌గా అడిగింది. దీనికి షాకైన పృథ్వీ నవ్వుతూ.. ఏంటి కాఫీ ఇస్తే ప్రేమించాలా అని అడిగాడు. కాఫీ ఏంటి? నీకు అన్నీ చేసి పెడుతున్నా కదా అంటూ విష్ణు తెగ గారం చేసింది. కాఫీ చేశారంతే అన్నీ చేసి పెట్టారంట అంటూ తెగ నవ్వుకున్నాడు పృథ్వీ. కాఫీ, యాపిల్ ముక్క ఇచ్చానంటు విష్ణుప్రియ చెప్పగా.. నైస్ కాఫీ, బాగుందంటూ చెప్పి పృథ్వీ అక్కడి నుండి వచ్చేశాడు.
ఇక కాఫీ తీసుకున్నాడు కానీ హెల్ప్ చేయలేదంటూ పృథ్వీని బేబక్క నామినేట్ చేసింది. అయితే విష్ణుప్రియ నామినేషన్ ఇంకా టీవీలో చూపించలేదు. ఇక నిన్నటి నామినేషన్ ప్రక్రియ జరుగుతుండగా విష్ణుప్రియ నిల్చోవడం, కూర్చోవడం, ఆ తర్వాత అటు ఇటు తిరగడం చేసేస్తుంది. మిన్న నాగ మణికంఠ, నిఖిల్ మధ్య తీవ్రంగా ఆర్గుమెంట్స్ జరుగుతుంటే.. హ్యాపీగా డ్యాన్స్ స్టెప్స్ వేసేసింది విష్ణుప్రియ. మొన్నటి నుండి తనని నెట్టింట ఆడేసుకుంటున్నారు. మరి విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ల లవ్ స్టోరీ ముందుకు కొనసాగుతుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.