English | Telugu
సెంటిమెంట్ తో హౌస్ లో అందరినీ కన్నీళ్లు పెట్టించిన మణికంఠ
Updated : Sep 4, 2024
నామినేషన్లో హీటెడ్ ఆర్గుమెంట్స్ ఇంకా అలానే ఉన్నాయంటూ బిగ్ బాస్ తాజాగా ప్రోమో వదిలాడు. ఒక్కో నామినేషన్ లో ఒక్కో పాయింట్ తో ప్రేక్షకులకి ఎంటర్‌టైన్ చేయడానికి బిబి ఎడిటర్ మామ బానే కష్టపడుతున్నాడు.
నేటి ప్రోమోలో ఏం ఉందంటే.. బేబక్క వర్సెస్ సీత మధ్య మళ్లీ కూర గురించే గొడవ మొదలైంది. కూరలో కారం ఎక్కువ వేసేశావ్.. పప్పు మాడిపోయింది... నేను గుడ్డు బురిజీ వేసుకుంటానంటే వద్దన్నావంటూ బేబక్కని నామినేట్ చేస్తుంది సీత. ఆ తరువాత విష్ణు ప్రియకి సోనియా ఇచ్చిపడేసింది. రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు మానేయాలి.. పక్కకి వెళ్లి చిల్ అవ్వమని చెప్పింది. ఆ తర్వాత మణికంఠను అభయ్ నవీన్ నామినేట్ చేయడంతో.. ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. ఇక మణికంఠని బాషా నామినేట్ చేస్తూ.. ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నావని అన్నాడు. ఏంటి రాజకీయమా? నేను చావు వరకూ వెళ్లి వచ్చా.. మీరు చూడలేదు.. నేను అందర్నీ పోగొట్టుకున్నా.. తల్లి లేదు తండ్రి లేదు.. పెంచిన తండ్రితో అవమానాలు ఎదుర్కొన్నా.. అమ్మ చనిపోతే కట్టెలు పేర్చడానికి డబ్బులు అడుక్కుని తీసుకొచ్చి దహన కార్యక్రమాలు చేశానంటూ తన బాధలు గురించి చెప్తుంటే అక్కడున్న హౌస్ మేట్స్ అంతా ఏడ్చేశారు. మొత్తానికి హౌస్ మేట్స్ అందరిపై సెంటిమెంట్ అస్త్రాన్ని వాడాడు మణికంఠ. మరి ఇది అతనికి ప్లస్ అవుతుందా లేదా అని తెలియాల్సి ఉంది.
అయితే హౌస్ లో ఉన్నవాళ్ళకి నాగ మణికంఠపై సింపథీ పెరిగింది కానీ చూసే ఆడియన్స్ మాత్రం గట్టిగా ట్రోల్స్ చేస్తున్నారు. " జాబ్ నచ్చకుంటే సర్దుకొని పని చేస్తాం లేదా రిజైన్ చేస్తాం అంతేకానీ రోజు పర్సనల్ బాధలు చెప్తూ ఉండముగా.. ఇది అంతే.. చేతనైతే గేమ్ ఆడండి లేకపోతే వెళ్ళండి అంటు ఓ నెటిజన్ ప్రోమో కింద కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్ సరైనదే కాబట్టి ఇప్పుడు ఇది ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. బిగ్ బాస్ ప్రోమోలో ఎవరి పాయింట్ వ్యాలిడ్ అనిపించింది? ఎవరికి మీ సపోర్ట్ కామెంట్ చేయండి.