English | Telugu
బేబక్క నామినేషన్ తో హర్ట్ అయిన పృథ్వీరాజ్ .. నీ వాయిస్ వినిపించడం లేదు!
Updated : Sep 4, 2024
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు గ్రాండ్ గా లాంఛ్ అయింది. ఇక నామినేషన్ల ప్రక్రియతో కంటెస్టెంట్స్ మధ్య చిచ్చుపెట్టాడు బిగ్ బాస్.
అయితే సోనియా నామినేషన్ల ప్రక్రియ మొదలెట్టగా.. తను ప్రేరణ, బేబక్కని నామినేట్ చేయగా ఛీఫ్ లలో ఉన్న యష్మీ తన ఫ్రెండ్ ప్రేరణనని సేవ్ చేసింది. ఆ తర్వాత నబీల్ ఆఫ్రిదీ, పృథ్వీరాజ్ లని బేబక్క నామినేట్ చేసింది. హౌస్ లో నీ వాయిస్ వినపడం లేదని, యాక్టివ్ పార్టిసిపేషన్ లేదంటూ నబీల్ ని నామినేట్ చేసింది బేబక్క.
ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది బేబక్క. కాఫీ కావాలన్నా ఏం కావాలన్నా మీరు అడుగుతున్నారు కానీ కిచెన్ లో ఉన్నవాళ్ళకి అంతగా హెల్ప్ చేయడం లేదు.. మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మాకు సాయం చేయడం లేదంటూ రీజన్ చెప్పింది బేబక్క. దీనికి పృథ్వీ అదేంటి నేను కిచెన్ డిపార్ట్‌మెంట్ కాదు కదా.. అయిన మీరు నన్ను సాయం అడిగితే చేసేవాడిని అంటూ చెప్పాడు. ఇంతలో "గిన్నెలు కడిగావు కదా చెప్పు.." అంటూ పృథ్వీతో సీత అంది. గిన్నెలు కడిగాడు, వెజిటేబుల్స్ కోసి ఇచ్చాడు కూడా అంటూ సీత మధ్యలో మాట్లాడింది. దీంతో చీఫ్ నిఖిల్ మధ్యలో దూరి నువ్వు మాట్లాడొద్దంటూ సీతపై అరిచాడు. ఈ దెబ్బతో సీత ఫైర్ అయింది. నా ఇష్టం నేను మాట్లాడతా.. నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ గట్టిగానే గొడవ పెట్టుకుంది. ఇక చివరికి ఒక్క కాఫీ కోసం నామినేట్ చేశారా అంటూ బేబక్కని అడిగాడు పృథ్వీ. ఇంకా నామినేషన్ చేసేవాళ్ళు సగానికి పైగా ఉన్నారు.