English | Telugu
బిగ్‌బాస్ : ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరికి దక్కేను
Updated : Nov 19, 2021
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విమర్శలు చుట్టుముడుతున్నా తన పంథాని మార్చకుండా ముందుకు సాగుతోంది. మరో నాలుగు వారాల్లో షో ముగియబోతోంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో రసవత్తర మలుపులు చోటు చేసుకోబోతున్నాయి. ఇంటి సభ్యుల మధ్య రసవత్తరమైన పోటీ జరగబోతోంది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఒక కంటెస్టెంట్ ని ఎవిక్షన్ ఫ్రీ పాస్ పేరుతో నేరుగా ఫైనల్‌కి పంపించబోతున్నారు.
ఈ షో 19 మంది కంటెస్టెంట్‌లతో మొదలైంది. అందులో ఇప్పటి వరకు 9 మంది కంటెస్టెంట్‌లు ఎలిమినేట్ అయి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తాజాగా 10వ కంటెస్టెంట్ హెల్త్ కారణాలతో జెస్సీ బయటకి వచ్చేయడంతో హౌస్‌లో ఇప్పుడు 9 మంది కంటెస్టెంట్‌లు మిగిలిపోయారు. ఇందులో 5 గురు ఫైనల్‌కి వెళ్లబోతున్నారు. మిగిలిన నలుగురు ఇంటి నుంచి ఎఇలమినేట్ కానున్నారు.
ఎవిక్షన్ పాస్ కోసం బిగ్‌బాస్ `నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా` అనే టాస్క్‌ని ఇచ్చాడు. ఈ టాస్క్‌లో భాగంగా మొదటి ఫైర్ అలారం మోగినప్పుడు ఏ ఇద్దరు సభ్యులైతే ముందుగా ఫైర్ ఇంజిన్ లోకి వెళతారో వారే బర్నింగ్ హౌస్‌లో వున్న ఇద్దరిని సేవ్ చేస్తారో .. ఎవరిని మంటల్లో కాలిపోనిస్తారో నిర్ణయించాల్సి వుంటుంది. ఈ నేపథ్యంలో సన్నీ, పింకీ .. షన్ను, సిరిలని రిక్వెస్ట్ చేయడం.. నేను మారాలనుకుంటున్నానని సన్నీ అనడం.. నేను స్ట్రాంగ్ అని పింకీ చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రోమో ఆకట్టుకుంటోంది.