English | Telugu
వంటలక్క ప్రేక్షకులకు షాకివ్వబోతోందా?
Updated : Nov 19, 2021
బుల్లితెరపై టాప్ వన్ రేటింగ్‌తో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న ధారావాహిక `కార్తీక దీపం`. రేటింగ్ విషయంలో కాస్త వెనకబడిన ఈ సీరియల్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసింది. గత కొన్ని వారాలుగా సాగదీత ధోరణితో సాగుతున్న `కార్తీక దీపం` తాజా ట్విస్ట్‌లు.. మలుపులతో మళ్లీ గాడిలో పడింది. శుక్రవారం ఎపిసోడ్ సరికొత్త ట్విస్ట్‌లతో ప్రేక్షకులకు షాకివ్వబోతోంది. ఈ రోజు ఎపిసోడ్‌లో వంటలక్క తనని గత కొంత కాలంగా ఇష్టపడుతున్న ప్రేక్షకులకు షాకివ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇంట్లో జరుగుతున్న పరిణామాలు ఊహించని సంఘటనలకు షాకైన పిల్లలు సౌందర్య కూర్చుని ఒకప్పుడు ఎన్నో ప్రదేశాలకు వెళ్లామని కానీ ఇప్పుడు వెళ్లలేకపోతున్నామని బాధపడుతుంటారు. ఇవాళ అమ్మ పుట్టిన రోజు ఈ సందర్భంగా గోల్కొండకి వెళ్దామని అంటారు పిల్లలు. ఇదే సమయంలో దీప అక్కడికి వచ్చేస్తుంది. దీపని గమనించిన సౌందర్య ఈ రోజు నీ పుట్టిన రోజా పిల్లలు గోల్కొండ వెల్దాం అంటున్నారు. ఈ మాటలు పూర్తయ్యేలోపే `గోల్కొండకు కాదు.. ఆ పక్కనే వున్న సమాధుల్ని చూడ్డానికి వెళ్దాం` అంటుంది. దీంతో సౌందర్య, పిల్లలు ఒక్కసారిగా షాక్‌కు గురవుతారు.
కట్ చేస్తే సౌందర్య .. దీప మాటలు తలుచుకుంటూ బోరున ఏడుస్తుంటుంది. ఆనందరావు వచ్చి ఏం జరిగిందని ప్రశ్నిస్తాడు. దీపని చూస్తే భయమేస్తోందని, తన ప్రవర్తన విచిత్రంగా వుందని.. అవసరానికి మించి సంతోషంగా కనిపిస్తోందని.. చనిపోయేముందు ఎలా మాట్లాడతారో దీప అలా మాట్లాడుతోందని. దాని తీరు చూస్తుంటే ఆత్మహత్య చేసుకుంటుందేమో అని భయమేస్తోందని సౌందర్య బోరుమంటుంది. ఇంతకీ దీప మనసులో ఏముంది? .. దర్శకుడు వంటలక్కతో ప్రేక్షకులకు నిజంగానే షాకివ్వబోతున్నాడా? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.