English | Telugu

తమన్, డీఎస్పీ లతో తారక్ గేమ్.. ఈసారి డబుల్ ఫన్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవరు మీలో కోటీశ్వరులు' షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో అప్పుడప్పుడు సినీ సెలబ్రిటీలతో డబుల్ వినోదాన్ని పంచుతున్న తారక్.. ఈ దీపావళికి రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీప్రసాద్, తమన్ లతో చేసిన స్పెషల్ ఎపిసోడ్ తో స్పెషల్ డేకి సందడి చేయనున్నారు.

దేవిశ్రీప్రసాద్, తమన్ లు పాల్గొన్న 'ఎవరు మీలో కోటీశ్వరులు' స్పెషల్ ఎపిసోడ్ దీపావళి కానుకగా నవంబర్ 4న రాత్రి 8:30 కి ప్రసారం కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది. తమన్, డీఎస్పీ లతో తారక్ కి మంచి బాండింగ్ ఉంది. దీంతో ఎపిసోడ్ అంతా ఫుల్ ఫన్ తో సరదాగా సాగినట్లు తెలుస్తోంది. తారక్ తన కామెడీ టైమింగ్ తో మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరినీ ఒక ఆట ఆడుకున్నారని అంటున్నారు. ఇక ఎపిసోడ్ లో తారక్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని ప్రోమో, పోస్టర్స్ చూస్తే అర్థమవుతుంది. వైట్, బ్లూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేసిన డ్రెస్ తో తారక్ చాలా ఎట్రాక్టివ్ గా ఉన్నారు. మరి దేవిశ్రీప్రసాద్, తమన్ లతో కలిసి తారక్ దీపావళికి ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే ఈ షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వరలో సందడి చేయనున్నారు. ఇప్పటికే ఈ స్పెషల్ ఎపిసోడ్ షూట్ కూడా పూర్తయింది. నవంబర్ 18న మహేష్ పాల్గొన్న ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని, ఆ ఎపిసోడ్ తోనే ఈ సీజన్ ముగియనుందని సమాచారం.