English | Telugu
'ఎక్స్ట్రా జబర్దస్త్' టీమ్ లీడర్‌ను కొట్టబోయిన మనో!
Updated : Nov 2, 2021
'ఎక్స్ట్రా జబర్దస్త్' లాస్ట్ ఫ్రైడే ఎపిసోడ్ చూశారా? 'రాకింగ్' రాకేష్ స్కిట్ చేస్తున్నాడు! మధ్యలో జడ్జ్ సీటులో కూర్చున్న మనో పంచ్ డైలాగులు వేశారు. 'ఓ ముద్దు ఇవ్వొచ్చు కదా' అని రోషిణి అడిగితే... రాకేష్ డైలాగ్ చెప్పడానికి ముందు మనో చెప్పారు. 'ఏనాడైనా ఇచ్చానా' అని. నెక్స్ట్ ఆఫీసు నుండి వచ్చిన భర్తను రోహిణి గదిలోకి రమ్మని పిలుస్తుంది. 'మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఏనాడైనా...' అని రాకేష్ అనడమే ఆలస్యం 'లోపాలకి వెళ్లామా?' అని మనో డైలాగ్ అందుకున్నారు.
రాకేష్ స్కిట్ టైమ్‌లో మనో అంత సందడి చేశారు. కట్ చేస్తే... నెక్స్ట్ వీక్ ప్రోమోలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ టైమింగ్, రైమింగ్ ఏమయ్యాయో.... రాకేష్, మనో మధ్య ఏం జరిగిందో? పూర్తిగా చూపించలేదు. కానీ, రాకేష్ స్కిట్ చూసి మనో హార్ట్ అయినట్టు చూపించారు. 'ఎంత గౌరవం అయ్యా రాకేష్ నువ్వెంటే? ఏంటిది? పద్ధతేనా? మీరు చేస్తున్నది ఏంటి?' అని మనో ఆవేదన చెందినట్టు చూపించారు. ఆ తర్వాత జడ్జ్ సీటులోంచి దిగి కిందకు వెళ్లిపోయారు. రాకేష్ స్టేజి మీద నుండి కిందకు దిగగా... పైకి వెళ్లమని మనో చెప్పారు. ఆ సమయంలో కొట్టడానికి అన్నట్టు చెయ్యి ఎత్తారు. టీఆర్పీ కోసమా? లేదంటే నిజంగా గొడవ జరిగిందా? అనేది ఈ శుక్రవారం తెలుస్తుంది.