English | Telugu

Nayani Pavani Remuneration: నయని పావని రెమ్యునరేషన్ ఎంతో తెలుసా!



బిగ్ బాస్ సీజన్-8 లో ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్ట్ లు , మరెన్నో టాస్క్ లు.. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చాక నెక్స్ట్ లెవెల్ లో సాగుతున్న ఈ గేమ్.. ఇప్పుడు క్రైయింగ్ బేబీ నయని పావని ఎలిమినేషన్ తో మరో కొత్త ట్రాక్ లో వెళ్లనుంది.

బిగ్ బాస్ హౌస్ లో తొమ్మిదో వారం నయని పావని ఎలిమినేషన్ అయ్యింది. ఇక ఎలిమినేషన్ అయ్యాక హౌస్ లో కొంతమంది స్ట్రాంగ్ అని మరికొందరు ఫేక్ అని ఇంకా బాగా ఆడాలంటు కొన్ని సలహాలు ఇచ్చింది. ఇక హౌస్ లో మూడు వారాలు ఉండి నాలుగో వారం బయటకొచ్చేసింది నయని పావని. హౌస్ లో మొత్తం నెలరోజులు గడిపిన ఈ భామ.. రోజుకు లక్ష యాభై వేల చొప్పున నెలకు ఆరు లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

నయని పావని సీజన్-7 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి వారం రోజుల్లోనే బయటకి వచ్చేసింది. దాంతో తనకి చాలా సింపథీ వచ్చేసింది.‌ ఇక ఈ సీజన్ లో కూడ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వగా మొదటి వారం నామినేషన్ షీల్డ్ ద్వారా నామినేషన్ లో లేకుండా సేవ్ అయ్యింది.‌ ఇక హౌస్ లో ఒక్క గేమ్ కూడా గెలిచింది లేదు‌. ఎంతసేపు ఏడుపే.. ప్రతీ దానికి ఏడుపే.. హౌస్ లో క్రైయింగ్ బేబీ అనిపించిందని కిర్రాక్ సీతని నామినేషన్ చేసిన నయని పావని..చివరికి తనే క్రైయింగ్ బేబీగా మారిపోయింది. ఒకరకమైన విరక్తి తెప్పించేలా తన బిహేవియర్ ఉండటంతో జనాలు ఓటింగ్ లేక తొమ్మిదో వారం ఎలిమినేషన్ అయి బయటకు వచ్చేసింది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.