English | Telugu
గంట వరకు ఇంద్రజతో లిఫ్ట్ లో గేమ్ ఆడిన నరేష్... పవిత్ర మిసింగ్!
Updated : Aug 23, 2024
శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ ని కృష్ణ జన్మాష్టమి స్పెషల్ గా తీర్చిదిద్దారు. ఇక ఈ షోకి నిజంగానే కృష్ణుడిని పట్టుకొచ్చారు అదేనండి సీనియర్ నటుడు, విజయ నిర్మల సుపుత్రుడు నరేష్. ఐతే ఏ షోకైనా నరేష్ తో కలిసి పవిత్ర ఎంట్రీ ఇస్తుంది కానీ ఈ షోలో సింగల్ గా వచ్చాడు నరేష్. వీరాంజనేయులు విహార యాత్ర మూవీ టీమ్ వచ్చింది. ఇక షోలో నరేష్ చేసిన అల్లరి పనులు మాములుగా లేవు సుమీ..షోకి రావడం రావడమే ఇంద్రజని కూడా పడగొట్టే పనిలో పడ్డాడు. నరేష్ తమ్ముడు మహేష్ బాబు నటించిన పోకిరి మూవీలో లిఫ్ట్ సీన్ ని నరేష్, ఇంద్రజ కలిసి రిక్రియేట్ చేశారు. ఇంద్రజ, నరేష్ లిఫ్ట్ లో ఎక్కేసరికి లిఫ్ట్ ఆగిపోతుంది.
గంట వరకు లిఫ్ట్ లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్తారు. దాంతో ఇంద్రజ తెగ ఫీలైనట్టు నటించింది. ఇక తర్వాత ఇంద్రజ అడిగింది "ఎవరినైనా లవ్ చేస్తున్నారా అని..మరి నువ్వు" అని రివర్స్ లో అడిగాడు నరేష్. "నచ్చినోళ్ళు ఇంకా దొరకలేదు" అని చెప్పింది " ఎం కావాలేంటి" అని అడిగాడు నరేష్. "బాగా చదువుకుని పెద్ద జాబ్ చేస్తూ మంచివాడిగా ఉండాలి" అని చెప్పింది. ఇక నరేష్ "ఛీ" అన్నాడు. ఇంద్రజ వేసుకొచ్చిన సెంట్ స్మెల్ పీలుస్తూ ఆమె మీదకు వెళ్తుండేసరికి ఇంద్రజ తల దించేసుకుంది. "సెంట్ స్మెల్ బాగుంది" అన్నాడు. "అది హెయిర్ స్ప్రే..నా దగ్గర ఇంకా టు త్రి ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి " అని ఆన్సర్ ఇచ్చింది ఇంద్రజ. "ఒకటిస్తారా..ఒకటిస్తారా" అని అదేపనిగా అడిగాడు నరేష్. అలా ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇంద్రజ, నరేష్ కలిసి ఆడియన్స్ ని అలరించబోతున్నారు.