English | Telugu

Bigg Boss 9: దొంగలున్నారు జాగ్రత్త.. సంజనకి నాగార్జున వార్నింగ్!

బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వీకెండ్ కి వచ్చేసింది. ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ లో క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ ఎవరంటే సంజన అనడంలో ఆశ్చర్యం లేదు. ఓన్ గా కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి ఏ పనైనా చేస్తుంది. దొంగతనం చెయ్యడమంటే తనకి సరదా కాబోలు. (Bigg Boss 9 Telugu)

ఈ వారం హౌస్ మేట్స్ కి వచ్చిన ఎగ్స్ ని మొత్తం సంజన ఒక్కతే తిన్నది.. అది కూడా స్టోర్ రూమ్ కి వెళ్ళి తిన్నది. ఆ వీడియోని నాగార్జున బిగ్ టీవీలో ప్లే చేసి చూపించాడు. అలా చెయ్యకని ఇదివరకే చెప్పాను ఫ్రాంక్ అని నువ్వు అనుకుంటున్నావు.. తెఫ్ట్ అని మేమ్ అనుకుంటున్నాం.. నీ వల్ల ఇంట్లో అందరు సఫర్ అవుతున్నారు. నీ కోసం నలుగురు త్యాగం చేశారు. ఇప్పుడు వాళ్ళు కూడా నీ వైపు లేరు అని నాగార్జున ఫుల్ గా క్లాస్ తీసుకుంటాడు. సారీ సర్ ఇంకొకసారి ఇలా చెయ్యనని సంజన అంటుంది. నన్ను కార్నర్ చేశారు సర్ అని సంజన అనగానే.. నువ్వు ఎగ్స్ తిన్నావని తెలిసి కూడా ఎవరైనా నిన్ను ఏమైనా అన్నారా.. భరణి సిగ్గుందా అని అన్నాడని అన్నావ్.. నువ్వేం పని చేస్తే ఆ మాట అంటాడు.. నీ కోసం తన గిఫ్ట్ త్యాగం చేసాడు.. అది హౌస్ లోకి వద్దంటే నేను కూడా వెళ్ళనని రిటర్న్ వెళ్ళిపోయాడు. అలాంటిది నీ కోసం ఇచ్చాడు. ఫ్లోరా నీకు అన్ని పనులు చేస్తోంది.. నిన్ను ఎవరు కార్నర్ చేసారో చెప్పమని సంజనపై నాగార్జున సీరియస్ అవుతాడు.

ఆ తర్వాత దొంగళ్ళున్నారు జాగ్రత్త అని బోర్డుని సంజన మెడలో ఇమ్మాన్యుయేల్ వేస్తాడు. అయ్యో పెద్ద సైజ్ రాలేదు అని నాగార్జున అంటాడు. నేను బిగ్ బాస్ ని రిక్వెస్ట్ చేశాను సర్ అని సంజన అనగానే అది కాంప్లిమెంట్ కాదు పనిష్మెంట్ అని నాగార్జున అంటాడు. అందుకు ఈ వారం మొత్తం రెంటర్స్ లో వాళ్ళు చేసే పని నువ్వే చెయ్యాలి.. నీతో ఆ పని చేయించే బాధ్యత కెప్టెన్ గా రాము రాథోడ్ ది అని నాగార్జున చెప్పాడు.