English | Telugu

Bigg Boss 9: హరీష్, ఫ్లోరాలకి బ్లాక్ స్టార్..  సిల్వర్ స్టార్ పొందింది ఎవరంటే..?

బిగ్ బాస్ సీజన్-9 నాలుగో వీకెండ్ వచ్చేసింది. ఇక శనివారం నాటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ సారి చూసేద్దాం... నాగార్జున ఈసారి నాలుగు వారాల పర్ఫామెన్స్ ని బట్టి స్టార్స్ ఇచ్చాడు. మొదటగా ఇమ్మాన్యుయేల్ కి గోల్డ్ స్టార్ వచ్చింది. ఆ తర్వాత కొంతమందికి సిల్వర్ స్టార్స్ వచ్చాయి. రీతూ, దివ్య, తనూజ, శ్రీజ, సంజన, భరణి, సుమన్ శెట్డి, రాము రాథోడ్, పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్ లకి సిల్వర్ స్టార్స్ వచ్చాయి.

ఫ్లోరా సైనీ, మాస్క్ మ్యాన్ హరీష్ కి బ్లాక్ స్టార్స్ వచ్చాయి. హౌస్ లో ఫ్లోరాకి సొంత నిర్ణయం అంటూ ఏం లేదు సంజనకి అసిస్టెంట్ గా ఉంటూ తన ఆట తను ఆడడం లేదని బ్లాక్ స్టార్ ఇచ్చారు నాగార్జున. ఇక మాస్క్ మ్యాన్ హరీష్ ఎందులో ఇన్వాల్వ్ మెంట్ లేదు.. హౌస్ లో అన్ని వస్తువులు ఎలాగో.. నువ్వు అలాగే అని నాగార్జున చెప్పాడు. ఫ్లోరా, హరీష్ ఇద్దరికి బ్లాక్ స్టార్ వచ్చింది కనుక ఇద్దరిలో ఎవరు ఇంట్లో ఉండడానికి అనర్హులు అని భావిస్తారో వాళ్ళ ఫోటోని క్రషర్ లో వెయ్యమని కంటెస్టెంట్స్ కి నాగార్జున చెప్తాడు.

దాంతో హౌస్ లో ఉన్నవాళ్ళలో ఎక్కువగా ఫ్లోరా సైనీని సెలెక్ట్ చేసుకుంటారు. దాంతో తనకి రెండు వారాలు ఎవరు నామినేషన్ చేయకున్నా డైరెక్ట్ నామినేషన్ లో ఉంటుందని నాగార్జున చెప్పాడు. దానికి ఫ్లోరా సరే అంటుంది. నిజానికి గత నాలుగు వారాలుగా ఫ్లోరా నామినేషన్ లో ఉంటూ వస్తుంది. ఈ వీక్ నామినేషన్ నుండి ఫ్లోరా సైనీ సేవ్ అవుతుందో లేదో చూడాలి మరి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.