English | Telugu
మోనిత కంటపడిన డాక్టర్ బాబు... ఏం జరగబోతోంది?
Updated : Feb 5, 2022
బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న సీరియల్ `కార్తీక దీపం`. పరిటాల నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్, శోభా శెట్టి కీలక పాత్రల్లో నటించారు. గత కొన్ని వారాలుగా ఆసక్తికర మలుపులతో సాగుతున్న ఈ సీరియల్ ప్రస్తుతం ఆ క్రేజ్‌ని క్రమ క్రమంగా కోల్పోతోంది. సాగదీత ధోరణి కారణంగా మహిళా ప్రేక్షకులకు విసుగుపుట్టిస్తున్న ఈ సీరియల్ తాజాగా కీలక ఘట్టానికి చేరినట్టుగా తెలుస్తోంది. ఈ శనివారం ఎపిసోడ్ ఎలాంటి మలుపులు తిరగబోతోంది?.. ఎలాంటి ట్విస్ట్ లకు తెరదించబోతోంది అన్నది ఓ సారి లుక్కేద్దాం.
ఆదిత్య, కావ్యలు కారులో వెళుతూ మోనిత చేసిన ఛాలెంజ్ గురించి ఆలోచిస్తూ వుంటారు. మరో వైపు మోనిత, భారతి బర్త్ డే పార్టీకి వెళుతుంటారు. మరో వైపు కార్తీక్ , దీపలు వంట చేయడానికి అంజలి ఇంటికి వస్తారు. ఆ సమయంలో డాక్టర బాబుని చూస్తూ .. ఎలా వుండేవాడు.. ఎలా అయిపోయాడని ఆలోచిస్తూ వుంటుంది. ఇది గమనించిన డాక్టర్ బాబు ఏమైంది అని దీప ని అడుగుతాడు. మీరు వంట చేయడానికి రావడం నాకు నచ్చలేదంటుంది. దీంతో తన మైండ్ ని దారి మళ్లించాలని డాక్టర్ బాబు జోక్ లు చెబుతాడు..
Also Read:సంపాదించిందంతా ఒక్క సినిమాతో పోయింది!
కట్ చేస్తే...డాక్టర్ అంజలి ఇంటికి వచ్చిన మోనిత, డాక్టర్ భారతి ఆమె ఇంటిని డెకరేట్ చేస్తుంటారు. ఈ క్రమంలో మోనిత మెడలో మంగళసూత్రాన్ని డాక్టర్ అంజలి చూస్తుంది. మీకు పెళ్లైందా? అని అడుగుతుంది. మోనిత అవునంటుంది. ఆ వెంటనే మీ వారు ఏం చేస్తుంటారని అడుగుతుంది అంజలి. తను కూడా డాక్టరే అంటుంది. అతనొక కార్డియాలజిస్ట్ అని చెబుతుంది. అయితే మీ వారికి ఫేమస్ కార్డియాలజిస్ట్ కార్తీక్ తెలిసే వుంటుంది అని చెబుతుంది అంజలి. దాంతో మోనిత షాక్ అవుతుంది. కట్ చేస్తే కార్తిక్ , దీప వంట చేస్తూ ఉంటారు. అక్కడికి అంజలి వెళ్లమనడంతో వెళ్లిన మోనితకు డాక్టర్ బాబు వంటలు చేస్తూ కనిపిస్తాడు.. ఆ తరువాత ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.