సంపాదించిందంతా ఒక్క సినిమాతో పోయింది!
on Feb 5, 2022

'అన్నమయ్య', 'శ్రీమంజునాథ', 'శ్రీరామదాసు' వంటి సినిమాలతో రచయితగా గొప్ప పేరు సంపాదించుకున్నారు జేకే భారవి. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలకి రచయితగా పని చేసిన ఆయన.. పేరుతో పాటు డబ్బులు కూడా సంపాదించారు. అయితే ఒక్క సినిమాతో ఆ సంపాదించిన డబ్బంతా పోగొట్టుకొని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని భారవి తెలిపారు.
జేకే భారవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక్క సినిమా కారణంగా తాను సంపాదించిందంతా పోగొట్టుకున్నానని చెప్పారు. "ఇండస్ట్రీలో తాను చూసినన్ని కార్లు మరే రచయిత చూసి ఉండడు. కెరియర్లో ఎన్నో కార్లు చూసిన నేను.. ఇప్పుడు ఇంటర్వ్యూకి బైక్ పై వచ్చాను. అందుకు కారణం నేను నిర్మించిన 'జగద్గురు ఆదిశంకర' సినిమా. ఆ సినిమా కారణంగా ప్రస్తుతం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నాను. సినిమాల్లో సంపాదించిన డబ్బు సినిమాల్లోనే పోయింది. నేను సంపాదించిందంతా ఆ ఒక్క సినిమాతో పోయింది."
"ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో పలు సినిమాలకు పనిచేసే అవకాశం వచ్చింది. కానీ కరోనా వలన డబ్బు రావడం ఆలస్యమవుతోంది. నా పరిస్థితి ఇది అని చెబితే రాఘవేంద్రరావు గారు, నాగార్జున గారు వెంటనే సాయం చేస్తారు. కానీ ఎవరి ముందూ చేయి చాచడం నాకు ఇష్టం లేదు" అంటూ భారవి చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



