English | Telugu

'జ‌బ‌ర్ద‌స్త్'లోకి రోజా రీఎంట్రీ ఇచ్చారా?

'జ‌బ‌ర్ద‌స్త్' కామెడీ షోకు గ‌త కొంత కాలంగా మ‌నోతో క‌లిసి రోజా జ‌డ్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఆమెకు ఏపీ మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్క‌డంతో `జ‌బ‌ర్ద‌స్త్‌` కామెడీ షోకు గుడ్ బై చెప్పేశారు. చాన్నాళ్లుగా టీమ్ తో కొన‌సాగుతూ అనుబంధం ఏర్ప‌డ‌టంతో చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు కూడా. అయితే ఈ స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న మ‌ల్లెమాల ఎంట‌ర్ టైన్ మెంట్ కూడా రోజాను ప్ర‌త్యేకంగా స‌త్క‌రించి టీమ్ మెంబ‌ర్స్ తో వీడ్కోలు చెప్పించింది.

క‌ట్ చేస్తే.. తాజా ప్రోమోలో రోజా టీమ్ మెంబ‌ర్స్ పై పంచ్ లు వేస్తూ న‌వ్వులు పూయించ‌డం ఇప్ప‌డు ప‌లువురిని ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డంతో జ‌బ‌ర్ద‌స్త్ నుంచి రోజా త‌ప్పుకోవ‌డంతో ఆ స్థానంలోకి ఇంద్ర‌జ వచ్చి చేరింది. కానీ తాజా ప్రోమోలో ఇంద్ర‌జ క‌నిపించ‌కుండా రోజానే క‌నిపించ‌డం ఏంట‌ని, రోజా అలా వెళ్లి మ‌ళ్లీ రీఎంట్రీ ఇచ్చేసిందా అని ఆరా తీస్తున్నారు. వ‌చ్చే వారం అంటే ఈ నెల 28న రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది.

అయితే కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల చేసిన ప్రోమోలో మ‌నో తో క‌లిసి రోజా జ‌బ‌ర్ద‌స్త్ షోలో సంద‌డి చేస్తూ క‌నిపించారు. జ‌డ్జి సీట్ లో రోజా ఎప్ప‌టిలాగే క‌నిపించి స‌ర్ ప్రైజ్ చేశారు. ఎప్ప‌టి లాగే టీమ్ మెంబ‌ర్స్ పై పంచ్ లు వేస్తూ న‌వ్వులు పూయించారు. రాకెట్ రాఘ‌వ‌, తాగుబోతు ర‌మేష్ లు చేసిన స్క‌ట్ ల‌పై రోజా పంచ్ లు వేశారు. ఓ ద‌శ‌లో కామెడీ కావాలంటూ రోజా వేసిన పంచ్ ల‌కు టీమ్ మెంబ‌ర్స్ బిక్క మొహం వేశారు. అయితే తాజా ప్రోమో రోజా `జ‌బ‌ర్ద‌స్త్ ` కి గుడ్ బై చెప్ప‌డానికి ముందు షూట్ చేసింద‌ని, ఇదే చివ‌రి ఎపిసోడ్ అని చెబుతున్నారు. రోజా అదిర‌పోయే పంచ్ ల‌తో న‌వ్విస్తున్న తాజా ప్రోమో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.