English | Telugu
అజయ్ ఎలిమినేట్.. నమ్మినోడే ముంచేశాడు
Updated : Apr 24, 2022
నమ్మినవాడే నట్టేట ముంచేస్తాడని అఖిల్ నిరూపించాడు. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో అతని కారణంగా మరో వికెట్ పడింది. మహేష్ విట్టా, స్రవంతి, ముమైత్ ఖాన్, తేజస్వీ, సరయు, ఆర్జే చైతు, శ్రీరాపాక. ఇక రెండవ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ముమైత్ ఖాన్ వరుసగా నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురు ఎలిమినేట్ అయిన తరువాత హౌస్ లో మొత్తం వున్న సభ్యులు 10 మంది. వీరికి ఝలక్ ఇస్తూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ బాబా భాస్కర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. హౌస్ లోకి తన ఎంట్రీతో ఒక్కసారిగా అందరి గేమ్ మారిపోయింది. ఓ భయం మొదలైంది.
హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చేసిన బాబా భాస్కర్ వచ్చీ రాగానే నామినేషన్స్ లో వున్న లేడీ అర్జున్ రెడ్డి` బిందు మాధవిని సేవ్ చేశాడు. దీంతో ఇంటి సభ్యులు అంతా షాక్ కు గురయ్యారు. ఏంటీ ఏం జరగబోతోంది.. గేమ్ ఎలాంటి టర్న్ తీసుకోబోతోందని ఆలోచనలో పడ్డారు. బిందు మాధవిని నామినేషన్స్ నుంచి తప్పించడంతో నామినేషన్స్ లో అఖిల్, అజయ్ , అషురెడ్డి, హమీదా వుండిపోయారు. ప్రతీ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై ముందు సస్పన్స్ వుండేది. కానీ మహేష్ విట్టా అసలు విషయం బయటపెట్టడంతో బిగ్ బాస్ కు ఎవరు నచ్చకపోతే వారినే నామినేట్ చేస్తాడని స్పష్టమైంది.
అంతే కాకుండా ఎలిమినేషన్స్ అనేవి ఓటింగ్ ప్రకారం జరగడం లేదనే వాదనకు బలం చేకూరింది. అయితే ఈ వారంలో ఒకే గ్రూప్ సభ్యులు అఖిల్, అషురెడ్డి, అజయ్ నామినేషన్స్ లో వున్నారో ఖచ్చితంగా ఈ గ్రూప్ నుంచే అ వారం ఎలిమినేషన్ వుంటుందని క్లారిటీ వచ్చేసింది. ఇందులో అజయ్ ఎలిమినేట్ అవుతాడని స్పష్టం అవుతోంది. కారణం అతన్ని అఖిల్ పక్కన పెట్టడమే. గత కొంత కాలంగా అఖిల్ కారణంగా అజయ్ సేవ్ అవుతూ వస్తున్నాడు. అతనికి ఎలాంటి ఫ్యాన్ బేస్ లేదు.. ఇటీవల కనెక్ట్ కావడంలేదని అఖిల్ .. అజయ్ ని పక్కన పెట్టేశాడు. దీంతో అతని ఓటింగ్ శాతం క్రమంగా తగ్గిపోయింది. బిందు మాధవిని ఎప్పుడైతే బాబా భాస్కర్ ఎంట్రీ ఇచ్చి సేఫ్ చేశాడో అప్పుడే అఖిల్ కి బయటి పరిస్థితి తెలిసిపోయింది. గ్రూప్ గా గేమ్ ఆడి వేష్టని తెలుసుకున్న అఖిల్ .. వెంటనే అజయ్ ని పక్కన పెట్టడంతో అజయ్ ఈ వారం ఎలిమినేట్ కావడం గ్యారెంటీ అని తెలిసిపోయింది. అఖిల్ వున్న ఫలంగా అజయ్ కి వెన్నె పోటు పొడవడంతో అజయ్ ఎలిమినేషన్ దాదాపుగా ఖరారైపోయింది.