English | Telugu
Karthika Deepam2 : కార్తీక దీపం సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. కొత్త సీఈఓ ఎవరంటే!
Updated : Nov 12, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-513 లో.... దీప సీఈఓగా ఉండనని క్లారిటీగా చెప్తుంది. మరి ఇప్పుడు కొత్త సీఈఓ ఎవరు అని జ్యోత్స్న అడుగుతుంది. నాకు ఇలా జరుగుతుందని ముందే తెలుసు అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను కొత్త సీఈఓ వస్తున్నాడని శివన్నారాయణ అంటాడు. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. రెస్టారెంట్ కి కొత్త సీఈఓ శ్రీధర్ అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. మావయ్యకి ఆ అర్హత ఉందా అని జ్యోత్స్న అడుగుతుంది. బిజినెస్ లో మంచి అనుభవం ఉందని శివన్నారాయణ చెప్తాడు.
అంటే రెండేసి పెళ్లిళ్లు చేసుకుంటే ఈ పోస్ట్ కి అర్హతనా అని జ్యోత్స్న అనగానే శివన్నారాయణ కోపంగా నువ్వు కాబట్టి నోటితో సమాధానం చెప్తున్నాను.. వేరొకరు అయితే చేత్తో సమాధానం వచ్చేదని శివన్నారాయణ అంటాడు. అందరు సీఈఓ శ్రీధర్ అంటే ఒప్పుకుంటారు. కార్తీక్ కి కూడా ఇండిపెండెంట్ బోర్డు మెంబర్ గా శివన్నారాయణ సెలక్షన్ చేస్తాడు. దాంతో జ్యోత్స్న కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. పారిజాతం కూడా వెళ్తుంది. తను వెళ్తుంటే తన కింద కత్తి పడిపోయి ఉంటుంది. అది చూసి కార్తీక్ అది జాగ్రత్తగా దాచిపెట్టు తర్వాత మాట్లాడుకుందామని చెప్తాడు. ఆ తర్వాత శివన్నారాయణ స్వయంగా శ్రీధర్ ని సీఈఓ చైర్ లో కూర్చొపెడతాడు. జ్యోత్స్న కి కూడా ఏదో ఒక పోస్ట్ ఇవ్వండి అని శ్రీధర్ అంటాడు. నువ్వే తనతో మాట్లాడమని శివన్నారాయణ అంటాడు. ఆ తర్వాత నాకు ఈ గౌరవం దక్కడానికి కారణం నువ్వే అని కార్తీక్ తో శ్రీధర్ గొప్పగా చెప్తాడు.
ఆ తర్వాత ఆ కత్తి మీటింగ్ కి ఎందుకు తీసుకొని వచ్చావని పారిజాతాన్ని శివన్నారాయణ అడుగతాడు. ఫ్రూట్స్ కట్ చెయ్యడానికి అని చెప్తూ పారిజాతం భయపడుతుంది. అప్పుడే జ్యోత్స్న వచ్చి తొక్కలో కత్తి గురించి ఏంటి డిస్కస్ అని కత్తి తీసుకొని విసిరేస్తుంది. జ్యోత్స్న పక్కన లాగేజ్ ఉంటుంది. అది చూసి ఎక్కడికి అని పారిజాతం అడుగుతుంది. మా ఫ్రెండ్ కెనడాలో ఉంది అక్కడకి వెళ్తున్నా.. ఇక్కడ నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు నేను ఎందుకు ఉండాలని జ్యోత్స్న అంటుంది. అప్పుడే శ్రీధర్ ఎంట్రీ ఇచ్చి.. నువ్వు ఎక్కడికి వెళ్లనవసరం లేదని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.