English | Telugu
Illu illalu pillalu : ప్రేమ చేసిన పనికి వేదవతి హ్యాపీ.. శ్రీవల్లికి వార్నింగ్!
Updated : Nov 12, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -314 లో.... ప్రేమ దగ్గరికి నర్మద వచ్చి చాలా థాంక్స్ ప్రేమ.. నా కోసం ఈ హెల్ప్ చేసావ్ ఈ తోటికోడలు కోసం మీ నాన్న జైలుకి వెళ్లేలా చేసావని నర్మద అంటుంది. వాళ్ళు కుట్ర చేశారు దానివల్ల నీ జాబ్ పోయేది.. పైగా ఈ కుటుంబం పరువు కూడా పోయేది.. ఇప్పటికవరకు నాపై కోపం ఉండేది ఇప్పుడు ద్వేషం మొదలైంది భరిస్తానని ప్రేమ అంటుంది. నేను నీకు ఇలా హెల్ప్ చేసానని ఎవరికి చెప్పకని ప్రేమ అంటుంది. దానికి నర్మద సరే అంటుంది.
వాళ్ళ మాటలు అన్నీ వేదవతి విని.. అన్నీఈ మేనత్త పోలికలే.. కుటుంబం గురించి ఎంత బాగా ఆలోచించిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు ధీరజ్ జరిగింది గుర్తుచేసుకుంటాడు. అప్పుడే ప్రేమ వస్తుంది. మీ వాళ్ళకి కొంచెం కూడా సిగ్గు లేదు.. మా వదినపై అలా కుట్ర చేశారు.. నువ్వు కూడా మీ వాళ్ళ లాగే మొన్న ఎందుకు మీ ఇంటికి వెళ్ళావ్.. ఇప్పుడు కూడా వెళ్ళు అని ప్రేమ చెయ్ పట్టుకొని ధీరజ్ బయటకు తీసుకొని వస్తాడు. నేను వెళ్ళనని ప్రేమ అంటుంది. మొన్న ఎగేసుకుంటూ ఎందుకు వెళ్ళావ్ ఏం చేసావని ధీరజ్ అడుగుతాడు. ప్రేమ సైలెంట్ గా ఉంటుంది.
మరొకవైపు భద్రవతి, విశ్వ లాయర్ దగ్గరికి కి వెళ్లి సేనాపతి కి బెయిల్ గురించి మాట్లాడతారు. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది ఎందుకు అంటే ఒక డబ్బు ట్రాన్స్‌ఫర్ అనే కారణం పట్టుకొని అరెస్ట్ చెయ్యడం తప్పు అని లాయర్ చెప్తాడు. ఆ తర్వాత మా గురించి ప్రేమకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందోనని శ్రీవల్లి భపడుతుంది.అప్పుడే ప్రేమ వస్తుంది. నీ హస్తం గానీ ఈ కుట్రలో ఉందని తెలిస్తే ఒప్పుకోనని శ్రీవల్లికి ప్రేమ వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.