English | Telugu
Brahmamudi : భార్యల కోసం భర్తలు చేసిన వంట.. అది తిని వాంథింగ్ చేసుకున్నారుగా!
Updated : Nov 12, 2025
స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -876 లో.....కావ్యకి ఇష్టమైన ఫుడ్ చేసి పెడుతాడు రాజ్. ఇంట్లో వాళ్ళు రాకముందే తినేసేయ్.. లేదంటే మీదపడి లాగించేస్తారని రాజ్ అంటాడు. ఆ మాటలు వింటారు ఇందిరాదేవి, అపర్ణ. ఎలా కన్పిస్తున్నాంరా నీకు అని రాజ్ పై కోపంగా ఉంటారు ఇద్దరు. నన్ను భలే ఇరికించావే అని కావ్యపై రాజ్ కోప్పడతాడు. మరుసటి రోజు అందరు హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే రాజ్ వస్తాడు.
ఇంట్లో అందరు తమకి ఏం కావాలో అన్నీ ఒక లిస్ట్ చెప్తారు. నేను చెయ్యనని రాజ్ అంటాడు. పెళ్ళానికి అయితే నచ్చింది చేస్తావని ఇందిరాదేవి అంటుంది.. రాజ్ తన భార్యకి నచ్చింది చేస్తున్నాడు.. మీరు కూడా చెయ్యండి అని ధాన్యాలక్ష్మి, అపర్ణ ఇద్దరు వాళ్ళ భర్తలకి చెప్తారు. వాళ్ళు కిచెన్ లోకి ఉప్మా చేస్తారు అందులో ఉప్పుకి బదులు చక్కెర వేస్తారు. అది అపర్ణ, ధాన్యాలక్ష్మి తిని వాంథింగ్ చేసుకుంటారు. మరొకవైపు రాహుల్ దగ్గరికి ఒకతను వచ్చి ఇల్లీగల్ గోల్డ్ ని తీసుకొని రావాలని చెప్తాడు. నేను చెయ్యనని రాహుల్ చెప్తాడు.
ఇది చేస్తే ఇరవై లక్షలు లాభమని అతను చెప్తాడు. అయినా ఇక నేను అలాంటి పనులు చెయ్యనని రాహుల్ చెప్తాడు. అప్పుడే రుద్రాణి వచ్చి అంత లాభం ఉంటే ఎందుకు వద్దని అంటున్నావ్ ఏంటని రుద్రాణి అడుగుతుంది. లేదు మమ్మీ చెయ్యనని రాహుల్ అంటాడు. అప్పుడే స్వప్న వచ్చి అదంతా విని నిన్నటి వరకు ఏదో మూల డౌట్ ఉండే కానీ ఇప్పుడు నమ్మకం కలిగింది. నువ్వు మారిపోయావని రాహుల్ ని చూసి స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో నాకు మీరే చీర కట్టాలని కావ్య అంటుంది. దాంతో రాజ్ చీరకడుతూ కావ్య వంక రొమాంటిక్ గా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.