English | Telugu

రాకింగ్ రాకేష్‌.. జోర్దార్ సుజాత.. ఏం జ‌రుగుతోంది?

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో ప్రేమ జంట‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా మారుతోంది. ఇప్ప‌టికే ఈ షో ద్వారా సుడిగాలి సుధీర్ - ర‌ష్మీ గౌత‌మ్ క్రేజీ జోడీగా పాపుల‌ర్ అయ్యారు. ఎంతో మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ స్టేజ్ పై సుడిగాలి సుధీర్ - ర‌ష్మీల మ‌ధ్య స్కిట్ అంటే అది నెట్టింట ఓ రేంజ్ లో పేలుతూ వ‌స్తోంది. తాజాగా ఈ షో లో మ‌రో జంట వార్త‌ల్లో నిల‌వ‌డం మొద‌లైంది. అదే జోర్దార్ సుజాత - రాకింగ్ రాకేష్‌. ఈ మ‌ధ్యే వీరిద్ద‌రు క‌లిసి స్కిట్ లు చేయ‌డం మొద‌లు పెట్టారు. కామెడీ స్టార్స్ నుంచి బ‌య‌టికి వ‌చ్చేసిన సుజాత ఫైన‌ల్ గా రాకింగ్ రాకేష్ తో క‌లిసి స్కిట్ లు చేస్తోంది.

ఇక్క‌డే వీరి మ‌ధ్య మంచి స్నేహం మొద‌లైంది. తాజాగా రాకేష్ కోసం సుజాత కాస్ట్లీ గిఫ్ట్ ని ఇవ్వ‌డం ఇప్ప‌డు ఆక్తిక‌రంగా మారింది. ఈ జంట గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో మునిగితేలుతున్నారు. జ‌బ‌ర్త‌స్త్ వేదిక సాక్షిగా త‌మ ప్రేమ బంధాన్ని, ల‌వ్ స్టోరీని బ‌య‌ట‌పెట్టి షాకిచ్చారు. అప్ప‌టి నుంచి వీరి ర‌చ్చ ఓ రేంజ్ లో సాగుతూనే వుంది. స‌ర‌దాగా వుంటూనే ఒక‌రిపై ఒక‌రికి వున్న ప్రేమ‌ని తెలియ‌జేస్తున్నారు. తాజాగా రాకింగ్ రాకేష్ కి కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చి సుజాత స‌ర్ ప్రైజ్ చేసింది. ల‌క్ష రూపాయ‌ల విలువైన స్మార్ట్ ఫోన్ ని అత‌నికి గిఫ్ట్ గా ఇచ్చింది. గిఫ్ట్ చూసి ఎమోష‌న‌ల్ అయిన రాకింగ్ రాకేష్ న‌మ్మ‌లేక‌పోన్నానంటూ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

సుజాత ఫోన్ గిప్ట్ గా ఇవ్వ‌డాన్ని మొద‌ట రాకేష్ న‌మ్మ‌లేద‌ట‌. జోక్ చేస్తుంద‌ని భావించాడ‌ట‌. కానీ ఆమె సీరియ‌స్ గానే ఇస్తున్న‌ట్టు చెప్ప‌డంతో రాకేష్ నోట మాట రాద‌ట‌. అలాగే త‌న‌ని, ఫోన్ ని చూస్తూ వుండిపోయాడ‌ట‌. ల‌క్షా 20 వేల రూపాయ‌ల విలువ చేసే సామ్ సాంగ్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇవ్వ‌డాన్ని తాను ఇప్ప‌టికీ జీర్ణించుకోలేక పోతున్నాడ‌ట‌. ఇదే ఫోన్ ను సుజాత త‌న‌కోసం కొనుక్కుంటానంటే వ‌ద్ద‌ని వారించిన రాకింగ్ రాకేష్ ఏకంగా ఆ ఫోన్ ని త‌న‌కే ఇవ్వ‌డంతో మ‌రింత షాక్ కు గుర‌య్యాడ‌ట‌. షాక్ నుంచి తేరుకున్న రాకేష్ .. సుజాత త‌న‌కు బెంజికారు కొనిచ్చే స్థాయికి ఎద‌గాల‌ని కోరుకున్నాడ‌ట‌.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.