English | Telugu

Illu illalu pillalu : శోభకి పొంచి ఉన్న ప్రమాదం.. ధీరజ్ కనిపెడతాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -295 లో......ధీరజ్ మొదటి రోజు క్యాబ్ డ్రైవర్ గా వెళ్తున్నానని ప్రేమకి చెప్తాడు. ఈ రోజు ఎందుకో నా కన్ను అదురుతుంది. ప్లీజ్ ఈ రోజు వద్దని ప్రేమ ఆపుతుంది. అయిన వినకుండా బయల్దేరతాడు. దాంతో ప్రేమతో పాటు ఈ ఇంట్లో అందరు ఆపుతారు. అప్పుడే రామరాజు ఎంట్రీ ఇస్తాడు. ఏమైందని అడుగుతాడు.

నాన్న డబ్బు సరిపోవడం లేదని క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయ్యానని చెప్తాడు. ఏ రాయి అయితే ఏంటి కొట్టుకోవడానికి నేను చెప్పినట్టు విని మిల్ కి వస్తే బాగు పెడతావని రామరాజు అనగానే ధీరజ్ వెళ్ళిపోతాడు. ఏంటి అండి ఆ మాటలు అని వేదవతి అంటుంది. వాడు బాధ్యతతో ఉంటే నాకు గర్వంగా ఉంది కానీ అలా నేను కఠినంగా లేకపోతే అలుసు అవుద్ది అందుకే ఇలా అని రామరాజు అంటాడు. ఆ తర్వాత శ్రీవల్లిని విశ్వ పిలిచి అమూల్యని బయటకు పంపించు అంటాడు. అమూల్య దగ్గరికి శ్రీవల్లి వెళ్లి.. నాకు కడుపులో మంటగా ఉంది కూల్ డ్రింక్ తీసుకొనిరా అని చెప్తుంది. దాంతో అమూల్య వెళ్తుంటే ప్రేమ ఎదురుపడుతుంది. శ్రీవల్లి వదినకి కూల్ డ్రింక్ అంట అని అమూల్య చెప్తుంది. ఏంటి అలా చూస్తున్నావ్ వదినకి ఆమాత్రం తీసుకొని రావద్దా ప్రేమ ఉంటే తీసుకొని వస్తుంది లేదంటే లేదని శ్రీవల్లి అక్కడ నుండి వెళ్తుంది. ప్రేమని చూసి విశ్వ లోపలికి వెళ్తాడు. అసలు మొన్న ధీరజ్ మా అన్నయ్యని కొట్టడానికి కారణం ఏంటని ప్రేమ అడుగుతుంది. ఈ మధ్య నాతో మాట్లడడానికి ట్రై చేస్తున్నాడని అమూల్య చెప్తుంది.

మరొకవైపు క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అయి క్యాబ్ బుక్ చేసుకున్న వాళ్ళ దగ్గరికి ధీరజ్ వెళ్తాడు. ఒకమ్మాయిని తన ఫ్రెండ్స్ తో వాళ్ళ నాన్న బయటకు పంపిస్తాడు. నా కూతురుని ఎప్పుడు ఎక్కడికి పంపలేదని ధీరజ్ గురించి తెలుసుకొని తనని ఫోటో దింపుకుంటాడు. ముందు జాగ్రత్త బాబు అని చెప్తాడు. ఆ తర్వాత అమ్మాయి పేరు శోభ.. తన ఫ్రెండ్స్ ఇద్దరు బాయ్స్ కొంచెం దూరం వెళ్ళాక ఎక్కుతారు. వాళ్ళు శోభ గురించి ఏదో సైగ చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.