English | Telugu
Karthika Deepam2 : సుమిత్రని చూడలేక వెళ్ళిపోయిన జ్యోత్స్న.. కార్తీక్ ఏం చేయనున్నాడు!
Updated : Oct 22, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -494 లో..... సుమిత్రకి దీప టిఫిన్ తీసుకొని వస్తుంది. నేను తిననని అంటుంది. ఆ టిఫిన్ దీప చెయ్యలేదు నేనే చేసాననని కాంచన అంటుంది.ఆ తర్వాత సుమిత్రకి దీప టిఫిన్ తినిపిస్తుంది. దీప చాలా మురిసిపోతుంది. మరొకవైపు జ్యోత్స్న, పారిజాతం మాట్లాడుకుంటారు.
అవును అమ్మ వెళ్లడం నేను చూసానని జ్యోత్స్న చెప్పగానే పారిజాతం షాక్ అవుతుంది. అమ్మ బావకి దొరికింది అందుకే అంత కూల్ గా ఉన్నాడు.. మమ్మీ కన్పించకపోతే దీప ఎలా వెతికేది.. అలాంటిది వంట చేస్తూ ఇక్కడికి క్యారియర్ పంపిస్తుందంటే అర్థం చేసుకో.. నేను ఇప్పుడు బావ ఇంటికి వెళ్తున్నానని జ్యోత్స్న వెళ్తుంది. అసలు ఇది ఏం చేస్తుందని పారిజాతం అనుకుటుంది. ఆ తర్వాత దీప దగ్గరికి జ్యోత్స్న వెళ్తుంది. మా అమ్మ ఇక్కడ ఉందని అంటుంది. లేదని దీప చెప్తుంది. అక్కడే ఉన్న శౌర్యని అడుగగా.. అమ్మమ్మ ఉందని చెప్తుంది. నాకు చూపించు అనగానే శౌర్య తనని తీసుకొని వెళ్లి అంబుజవల్లి ఫోటో దగ్గరికి వెళ్లి ఆవిడే మా అమ్మమ్మ అని చూపిస్తుంది. శౌర్య నిజం చెప్పలేదని దీప, కాంచన హ్యాపీగా ఉంటారు. జ్యోత్స్న తిరిగి వెళ్తుంటే గదిలో నుండి దగ్గినట్లు సౌండ్ వస్తుంది. దాంతో జ్యోత్స్న గదిలోకి వెళ్లి చూస్తుంది. అక్కడ ఎవరుండరు. దాంతో జ్యోత్స్న తిరిగి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత దీప గదిలోకి వెళ్లేసరికి సుమిత్ర కింద పడిపోయి ఉంటుంది పైకి లేపి పైన పడుకోబెడుతుంది తనని ఆ సిచువేషన్ లో చూసి కాంచన బాధపడుతుంది. మరొకవైపు సుమిత్రని తల్చుకొని దశరథ్ బాధపడతాడు. అప్పుడే కార్తీక్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.