English | Telugu

Bigg Boss Telugu 8 : హౌస్ లో హీరో ఎవరు? జీరో ఎవరు?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం నాటి ఎపిసోడ్ లో ఎవరి పర్ఫామెన్స్ ఏంటో చెప్తూ హౌస్ మేట్స్ కి నాగార్జున క్లాస్ పీకాడు‌. హౌస్ లో ఎవరు హీరో? ఎవరు జీరో? చెప్పమన్నాడు నాగార్జున.

మొదటగా మణికంఠని అడగ్గా.. సీత హీరోలా ఆడిందంటూ నెత్తిన కిరీటం పెట్టాడు. చీఫ్ అయిన తర్వాత సీతలో చాలా లీడర్ షిప్ క్వాలిటీస్ కనిపించాయి.. ఏదైనా సరే ధైర్యంగా చెబుతుందంటూ మణికంఠ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. దీంతో నీకే కాదు నాకు కూడా సీత హీరో అంటూ నాగ్ ప్రశంసించారు. తర్వాత తన దృష్టిలో నైనిక జీరో అంటూ చెప్పాడు మణికంఠ చెప్పాడు. ఫస్ట్ వీక్‌తో పోలిస్తే ఇప్పుడు ఆట పరంగా చాలా డౌన్ అయిందంటూ మణి అన్నాడు. " టూ హండ్రెడ్ పర్సంట్ కరెక్ట్ " నాగార్జున అన్నాడు. ఆ తర్వాత యష్మీకి అవకాశం ఇవ్వగా.. తనకి ఆట పరంగా నబీల్ హీరో అంటూ యష్మీ చెప్పింది. ఎప్పుడు తను గేమ్ ఆడినా.. అలా నేను కూడా ఆడాలనుకుంటానంటూ యష్మీ చెప్పింది. మరి ఎందుకు ఆడట్లేదంటూ నాగార్జున అడుగగా.. లేదు సర్ వంద శాతం ట్రై చేస్తున్నా అంటూ యష్మీ అంది. అంతేనా లేక ఎవరినో చూస్తూ ఆటలో ఆగిపోతున్నావా అంటూ సెటైర్ వేశారు నాగార్జున. ఇక తన వరకు జీరో అంటే నైనిక అంటూ యష్మీ చెప్పింది.

ఇక తర్వాత నబీల్‌ ని అప్రిషియేట్ చేశాడు నాగార్జున. టాస్కుల్లో చాలా బాగా ఆడుతున్నావ్ నబీల్.. అసలు బెలూన్ టాస్కులో అయితే చాలా గొప్పగా ఆడావ్.. నువ్వు పృథ్వీ అంటూ నాగ్ అన్నారు. ఇక నబీల్ తన దృష్టిలో హీరో పృథ్వీ అంటూ చెప్పాడు. పృథ్వీ బెలూన్ టాస్కు సూపర్‌గా ఆడాడంటూ చెప్పగానే నాగ్ కూడా పృథ్వీకి కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. మూడు గంటలు ఫేస్ మీద చిరునవ్వు పోకుండా.. పాటలు పాడుకుంటూ ఆడావ్ గ్రేట్ అంటూ నాగార్జున అన్నాడు. ఇక తన వరకూ జీరో మణికంఠ అంటూ నబీల్ చెప్పాడు. మణికంఠకి క్లారిటీ లేదు.. సపోర్ట్ చేసేవాళ్లలోనే నెగెటివ్ తీసుకొని నామినేట్ చేస్తుంటాడు.. అంటూ నబీల్ చెప్పగా నాకు కూడా అదే అనిపిస్తుంది.. నువ్వు క్లారిటీ మిస్ అవుతున్నామంటూ మణికంఠకి నాగార్జున చెప్పాడు. దీనికి ఉదాహరణగా టాస్కులో త్యాగం చేసిన వీడియో చూపించాడు. అక్కడ సెల్ఫ్ శాక్రిఫైజింగ్ పాయింట్ అనేది అవసరమా.. నీకు ఓ స్టాండ్ ఉంటే దాని మీదే నిలబడు.. ఎందుకు ఓవర్ థింకింగ్.. అంటూ నాగ్ క్లాస్ పీకాడు. అలానే మైక్ తీసి విసిరేస్తావా అంటూ ఫైర్ అయ్యాడు. ఇక తర్వాత ఆదిత్య తన వరకూ హీరో నిఖిల్.. జీరో మణికంఠ అంటూ చెప్పాడు. నైనిక తనకి సీత హీరో.. మణికంఠ జీరో అంటూ చెప్పింది. తర్వాత ప్రేరణకి ఛాన్స్ ఇవ్వగా నబీల్‌ తన హీరో అని.. వాడిలో చాలా ఫన్, ఎమోషన్ ఉంది.. ఒక మంచి హ్యూమన్ బీయింగ్.. లీడర్ షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటూ ప్రేరణ అంది. ఇక తన వరకు జీరో నిఖిల్ అంటూ ప్రేరణ చెప్పింది. ఇక ఓవారాల్ హౌస్ లో హీరో ఎక్కువగా నబీల్ కి, జీరో ఎక్కువగా మణికంఠకి వచ్చింది. దాంతో మణికంఠ డేంజర్ జోన్ లో ఉన్నాడు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.