English | Telugu

Brahmamudi : స్వప్న పాప పుట్టినరోజుకి వచ్చిన రేవతి.. రుద్రాణి ప్లాన్ ఏంటంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -781 లో..... కావ్య ఏదో ఆలోచిస్తుంటే అప్పుడే రాజ్ వచ్చి అప్పు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా ఎందుకిలా ఉన్నారని అడుగుతాడు. రేపు మీ అక్క స్వప్న వాళ్ల పాప పుట్టినరోజు కదా ఆ ఏర్పాట్లలో బిజీగా ఉండాలి కానీ ఇలా చేస్తున్నారని రాజ్ అంటాడు.

నేను ఆలోచిస్తుంది అత్తయ్య గురించి అని కావ్య అనగానే ఇప్పుడు అమ్మకి ఏమైందని రాజ్ అడుగుతాడు. అత్తయ్యకి ఒక కూతురు ఉందని జరిగింది మొత్తం రాజ్ కి చెప్తుంది కావ్య. రేవతి గారు ఆవిడ కూతురా అని రాజ్ ఆశ్చర్యపోతాడు. ఎలాగైనా వాళ్ళని కలపాలని కావ్య అనగానే సరే నా దగ్గర ఒక ఐడియా ఉందని కావ్యకి ఏదో చెప్తాడు రాజ్. మరొకవైపు జగదీష్ ని రాహుల్, రుద్రాణి వాళ్ళు ఫాలో అవుతారు. రేవతి దగ్గరికి జగదీష్ వస్తాడు. మా అమ్మ ఈ రోజు మన కొడుకుని దగ్గరికి తీసుకుందని రేవతి చెప్పగానే జగదీష్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు అపర్ణ ఇంటికి రాగానే రాజ్, కావ్య తనని చూసి గొడవపడుతున్నట్ల యాక్టింగ్ చేస్తారు. ఏమైందని అపర్ణ అడుగుతుంది. మొన్న మమ్మల్ని ఒకావిడ కాపాడింది అన్నాను కదా ఆవిడని బర్త్ డే కి పిలుస్తానంటే తను వద్దని అంటున్నాడని కావ్య అనగానే పిల్వండి అని అపర్ణ అంటుంది. నేను పిలుస్తాను ఏం పేరు అని అపర్ణ అడుగుతుంది. రేవతి అని కావ్య చెప్పగానే అపర్ణ షాక్ అవుతుంది. రేవతికి అపర్ణ ఫోన్ చేస్తుంది. నేను కావ్య వాళ్ల అత్తయ్యని.. రేపు పుట్టినరోజుకి రండీ అని అపర్ణ చెప్పగానే రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది.

ఆ తర్వాత జగదీశ్, రేవతిలకి దూరంగా ఉండి రుద్రాణి, రాహుల్ అంతా వింటారు. వీళ్ళు మళ్ళీ ఒక్కటైతే ఆస్తులు మనకి దక్కవని రాహుల్, రుద్రాణి అనుకుంటారు. ముందు అపర్ణ వదినకి రేవతిపై కోపం ఉందో లేదో టెస్ట్ చెయ్యాలని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో స్వప్న పాప పుట్టినరోజుకి రేవతి వస్తుంది. తనని చూసి ఇంట్లో వాళ్ళందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.