English | Telugu

Karthika Deepam2 : హ్యాండ్ ఇచ్చిన దీప.. టెన్షన్ లో జ్యోత్స్న!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -417 లో... ఈ ఎంగేజ్ మెంట్ జరుగుతుందా లేదా నా మీద ఒట్టేసి చెప్పమని దీప చెయ్ సుమిత్ర తన తలపై పెట్టుకుంటుంది. నేను మీపై ఒట్టు వెయ్యలేనని దీప అంటుంది. అంటే నువ్వు ఈ ఎంగేజ్ మెంట్ జరగనివ్వవా అని సుమిత్ర అడుగుతుంది. దీప ముందు సుమిత్ర ఒక గీత గీస్తుంది. ఈ గీత దాటి ఎంగేజ్ మెంట్ అయిపోయే వరకు రాకని దీపతో సుమిత్ర చెప్పి వెళ్ళిపోతుంది. అదంతా కార్తీక్ చూస్తుంటాడు.

ఆ గీత దాటి రా దీప మనం చెయ్యాల్సింది బాగా ఉందని కార్తీక్ అనగానే నేను నా తల్లి మాట కాదని రాలేనని దీప చెప్తుంది. సరే నువ్వు ఇక్కడే ఉండి జరిగేది చూస్తూ ఉండని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గౌతమ్ తన కుటుంబంతో ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్నని పారిజాతం తీసుకొని వస్తుంది. గౌతమ్, జ్యోత్స్న పక్కన కూర్చుంటాడు. దీప ఎక్కడ కన్పించడం లేదని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. వెళ్ళు ఇక్కడికి తీసుకొని రా అని జ్యోత్స్న అనగానే దీప దగ్గరికి వెళ్తుంది పారిజాతం. గౌతమ్ గురించి అందరికి చెప్పు దీప అని పారిజాతం అనగానే.. మీకు గౌతమ్ గురించి తెలుసు కదా మీరే చెప్పుకోండి.. సుమిత్ర అమ్మగారు ఈ గీత గీశారు.. నేను దాటి రాలేనని చెప్పగానే పారిజాతం టెన్షన్ గా జ్యోత్స్న దగ్గరికి వెళ్లి ఆ దీప హ్యాండ్ ఇచ్చిందే అని చెప్తుంది. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఇప్పుడు మరదలకి వేరే మార్గం లేదు గౌతమ్ మంచివాడు కాదని తనే చెప్పాలని దీపతో అంటాడు కార్తీక్.

జ్యోత్స్న టెన్షన్ పడుతుంటే ఏమైందని గౌతమ్ అడుగుతాడు. దేని గురించి టెన్షన్ పడుతున్నావని కార్తీక్ తో పాటు అందరు అడుగుతారు. నా నోటితో నేను గౌతమ్ మంచివాడు కాదని చెప్పలేను అనుకొని నాకేం టెన్షన్ లేదు.. ఈ ఎంగేజ్ మెంట్ నాకు ఇష్టమే అని అనగానే సుమిత్ర వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ దీప, కార్తీక్ షాక్ అవుతారు. ఆ తర్వాత శివన్నారాయణకి ఏదో ఫోన్ రావడంతో బయటకు వెళ్తాడు. తన వెంటే దశరథ్ కూడా వెళ్తాడు. ఇద్దరు ఉంగరాలు మార్చుకోండి అని పంతులు చెప్తాడు. జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.