English | Telugu

Brahmamudi : మీటింగ్ కి వచ్చిన రాజ్.. చూసావా ఇది నీ స్థానం!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -552 లో.....రాజ్ కూరగాయలు పట్టుకొని ఇంటికి వస్తాడు. తనని చూసి రుద్రాణి భయపడి గట్టిగ అరుస్తుంది. దాంతో అందరు హాల్లోకి వస్తారు. ఏమైంది అత్త అలా అరిచావని రాజ్ అడుగుతాడు. నువ్వు కూరగాయల షాప్ ని పట్టుకొని వస్తుంటే.. భయమేసిందని రుద్రాణి అంటుంది. ఇక ఆ తర్వాత ఇదిగోండి.. మీరు చెప్పిన కూరగాయలు అని రాజ్ చెప్తాడు. ఒక కంపెనీకి సీఈఓ అయి ఉండి ఇలా చెయ్యడం బాధగా లేదా అని రుద్రాణి అనగానే.. ఎందుకు బాధ కన్నతండ్రికి తల్లికి లేని బాధ ఎందుకని రాజ్ అంటాడు.

నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలుసని అపర్ణ అంటుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో నాకు తెలుసని రాజ్ అంటాడు. ఆఫీస్ కి వెళ్ళమని ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు అంటారు. నేను వెళ్ళానని రాజ్ అంటాడు. నువ్వు ఆ కావ్య కింద పని చెయ్యడం ఏంటని రుద్రాణి అంటుంది. అయితే నీకు ఆఫీస్ వెళ్లడం ఇష్టం లేదు కాబట్టి ఇంట్లో పనులన్నీ నువ్వే చెయ్యాలని ప్రకాష్ అంటాడు. కార్ వాష్ చేసుకొని రా అంటూ కీస్ ఇస్తాడు. ఎందుకు చెయ్యను.. నేనే చేయింకకొని వస్తానని రాజ్ అంటాడు. మరొకవైపు కళ్యాణ్ పాట రాస్తు ఉంటాడు. సరిగ్గా లేదని చింపేస్తూ ఉంటాడు. అప్పుడే అప్పు వస్తుంది. అమ్మపై పాట రాయాలి. నాకు రాస్తుంటే మా అమ్మ చేసిన పనులు గుర్తు వస్తున్నాయని అంటాడు. తనకి బాధ ఉంటుంది కదా.. ధాన్యలక్ష్మి బాధని అప్పు అర్థం చేసుకొని మాట్లాడుతుంటే కళ్యాణ్ ఇంప్రెస్ అవుతాడు. నువ్వు మనుషులిని బాగా అర్థం చేసుకుంటావని కళ్యాణ్ అంటాడు.

ఆ తర్వాత రాజ్ కార్ వాష్ చేసుకొని వస్తాడు. ఇంకా ఏమైనా పనులు ఉంటే చెప్పండి అనగానే ప్రకాష్ ఫ్యాన్ తీసుకొని వచ్చి.. రిపేర్ చేయించుకొని రా అనగానే తనే రిపేర్ చేసి అందరిని ఆశ్చర్యపరుస్తాడు. మరొకవైపు కావ్య ఆఫీస్ కి వెళ్తుంది. రారు అనుకున్న క్లయింట్స్ వస్తుంటారు. అపర్ణ దగ్గరికి సుభాష్ వచ్చి మాట్లాడతాడు. దాంతో తను చేసిన మోసం గుర్తుచేస్తూ కోప్పడుతుంది. మరొకవైపు క్లయింట్స్ అలా ఎలా వచ్చారంటూ శృతి అడుగుతుంది. మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడాను.. రూల్స్ గురించి మాట్లాడానని కావ్య అనగానే మీటింగ్ కి వచ్చారు కానీ మనతో టై అప్ అవలేరు కదా అని శృతి అంటుంది. మరొకవైపు అందరు కలిసి రాజ్ ని ఆఫీస్ కి పంపించాలని తనని రెచ్చగొట్టేలా మాట్లాడతారు. తరువాయి భాగంలో మీటింగ్ కి రాజ్ వస్తాడు. అందరు మీరు ఎంత కాలం సీఈఓ గా ఉంటారు తెలియదు.. మీతో టై అప్ అవ్వలేమని చెప్పి వెళ్ళిపోతారు. చూసావా నీ స్థానం అది.. నిన్ను ఎవరు నమ్మరని కావ్యతో రాజ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.