English | Telugu

కాస్ట్యూమ్ చేంజ్ చేసిన శౌర్య ...కార్తీక దీపం ఫ్యాన్స్ ఖుషీ!

కార్తీక దీపం సీరియల్ బుల్లితెరపై ఒక చరిత్ర సృష్టించింది. ఒక సీరియల్ కి కూడా ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుందా అంటే అవుననే చెప్పాలి. ఏ మూవీకి లేనంత క్రేజ్ దీనికి ఉంటుంది. ఈ సీరియల్ లో కార్తీక్, దీప ఇద్దరిది పర్ఫెక్ట్ పెయిర్. కార్తీక దీపం సీరియల్ అయిపోవడంతో ప్రేక్షకులకు డిస్సపాయింట్ అయ్యారు. అందుకే ఇప్పుడు కార్తీక దీపం2 పేరుతో నవ వసంతం పేరిట ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.

ఈ సీరియల్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఇక సీరియల్ లో గత వారమే శౌర్య కోసం కార్తీక్ దీప మెడలో తాళికట్టాడు. అప్పటి నుండి సీరియల్ కి టీఆర్పీ భారీ స్థాయికి చేరుకుంది. దీప మెడలో కార్తీక్ తాళి కట్టేటప్పుడు కొంతమంది ఫ్యాన్స్ టీవీ ముందుకొచ్చి హారతులు కూడా పట్టారు. మరికొందరు అయితే కట్ చేశారు. ఆ వీడియోలు ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో వైరల్ అయ్యాయి. అయితే ఈ కార్తీక దీపం రెండో భాగంలో కార్తీక్, దీపలతో పాటు శౌర్యకి కూడా అంతే రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సీరియల్ లో శౌర్య, దీపలది మొదటి నుండి ఒకటే రకం కాస్టుమ్ వేసుకుంటున్నారు. స్టార్ మా రిలీజ్ చేసే కార్తీక దీపం-2 ప్రోమో కింద చాలా మంది కార్తీక్ దీపం ఫ్యాన్స్.. " ప్లీజ్ కార్తీక్ బాబు ఇప్పుడు దీపని పెళ్లి చేసుకున్నారు కదా.. దీప, శౌర్యలకి కొత్త బట్టలు కొనియ్యండి" అంటు తరచూ కామెంట్లు చేస్తుంటారు.

అది కాస్త డైరెక్టర్ చూసాడేమో.. ఇప్పుడు శౌర్య కాస్ట్యూమ్ చేంజ్ చేసారు. తాజాగా వచ్చిన కార్తీకదీపం-2 ప్రోమోలో శౌర్య ఫ్రాక్ లో కనిపించేసరికి ఈ సీరియల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఎప్పుడు లంగా జాకెట్ లో పేదింటి అమ్మాయిలా కన్పించే శౌర్య ఒక్కసారిగా రిచ్ కిడ్ లా కనిపించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక కార్తీకదీపం-2 అభిమానులకి మంచి రోజులు వచ్చినట్టే అనిపిస్తోంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.