English | Telugu
బిందుమాధవి దెబ్బ.. అఖిల్ అబ్బా!
Updated : Apr 12, 2022
బిగ్‌బాస్ హద్దులు దాటుతోందని తొలి సీజన్ నుంచే విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక అంతకు మించి అన్నట్టుగా ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో రచ్చ చేయించాలని ఫిక్సయ్యారో ఏమో తెలియదు కానీ బిగ్ బాస్ ఓటీటీ మాత్రం నిజంగానే హద్దులు దాటేసి పరాకాష్టకు చేరుకుంటోంది. కంటెస్టెంట్ లు వ్యవహరిస్తున్న తీరు సీజన్ ఎండింగ్ కు వస్తున్న కొద్దీ మరీ దారుణంగా మారుతోంది. ఇందులో ఏడవ వారం ఎలిమినేషన్ లో బిందు మాధవి, అఖిల్ ల మధ్య జరిగిన సంభాషణే ఇందుకు అద్దంపడుతోంది. ఈ వీకెండ్ లో నాగార్జున ఏకంగా ఇద్దరిని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించిన విషయం తెలిసిందే.
తాజాగా ఏడవ వారం ఎలిమినేషన్స్ ని ప్రారంభించేశారు. ఇక ఈ ఎలిమినేషన్ మరింత రచ్చ రచ్చగా సాగాలని బిగ్ బాస్ అనుకున్నాడో ఏమో కానీ అంతకు మించి అన్నట్టుగానే ఈ నామినేషన్ ల ప్రక్రియ మరింత రచ్చకు తెరలేపింది. హద్దులు దాటి కంటెస్టెంట్ లు ఒరేయ్.. ఒసేయ్ అనే స్థాయికి దిగజారింది. ఎవరి మధ్య అయితే గొడవ పీక్స్ కి చేరుకుంటుందో అదే జంట మధ్య బిగ్ బాస్.. నామినేషన్స్ పేరుతో మంట పెట్టేశాడు. అది ఓ రేంజ్ లో అంటుకుని అరేయ్ తురేయ్ అనే దాకా వెళ్లింది.
'నీ కంటే నేనే బెస్ట్' అంటూ అఖిల్ ముందు మొదలుపెట్టాడు. తరువాత బిందు ఆడుకుంది. `మీది మీదికి వచ్చింది నువ్వు. ఈ ఇంట్లో వుండే హక్కు నీకెంత వుందో నాకు అంతకంటే ఎక్కువ వుంది. పక్కకిపో పక్కకి పో అంటే నేనెందుకు పోతా..' అంటూ అఖిల్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ డిస్కషన్ లో బిందు మాధవిని అఖిల్ 'పండు.. బుజ్జి..వెళ్లి కుర్చీలో కూర్చో' అని వెటకారంగా అనడంతో బిందు మాధవి రెచ్చిపోయింది... 'అరేయ్ అఖిల్ గా ఏంట్రా.. చెప్పురా..' అంటూ షాకిచ్చింది. దీంతో అఖిల్ 'నా వల్ల కాదు' అంటూ చేతులెత్తేశాడు.