English | Telugu
పోలీసులకు చిక్కిన జ్వాల, హిమ
Updated : Apr 12, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. గత కొంత కాలంగా బుల్లితెర వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటూ దేశవ్యాప్తంగా అత్యధిక టీఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకున్న సీరియల్ గా రికార్డు సాధించింది. అయితే గత కొంత కాలంగా కథ గాడి తప్పడంతో ఈ సీరియల్ పై వున్న క్రేజ్ కాస్త తగ్గిపోయింది. దీంతో ప్రధాన పాత్రలైన వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలనిఎండ్ చేసేసి కొత్త జనరేషన్ తో కథని గాడిలో పెట్టాలనిదర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు.
కానీ ఈ కథ మళ్లీ గాడిలో పడటం ఇక కష్టమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కథ. కథనాలు ఆకట్టుకునే స్థాయిలో లేకపోవడం, మనసుని హత్తుకునే పాత్రలు లేకపోవడంతో ఈ సీరియల్ ఏదో నడుస్తోంది అంటే నడుస్తోంది అన్నట్టుగా సాగుతోంది. హిమ, శౌర్యల పాత్రలతో కథని నడిపిస్తున్నాడు దర్శకుడు. ఈ మంగళవారం ఎపిసోడ్ కాస్త ఆసక్తిగా సాగబోతోంది. జ్వాల గా పేరు మార్చుకున్న శౌర్య తనని బాగా చూసుకుంటుందని హిమ సంతోషపడుతూ వుంటుంది. అంతే కాకుండా ఐయామ్ తింగరి అంటూ గంతులేస్తూ వుంటుంది.
కట్ చేస్తే.. తమ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన శౌర్య కోసం హిమ వెతుకుతోందని, ఆమెకు తను కూడా సహాయం చేస్తున్నానని, మీరు ఎందుకు దీని గురించి పట్టించుకోవడం లేదని ఆనందరావుని నిరుపమ్ అడుగుతాడు. శౌర్య మనకు దొరకకూడదని నిర్ణయించుకుందేమోనని నా అనుమానం అంటాడు. కట్ చేస్తే.. హిమ, నిరుపమ్ లు జ్వాల దగ్గరికి వస్తారు. 'నీ హుషారు కొంచెం హిమకు కావాలి. అందుకే హిమని నీతో తిప్పుకో, నీలా మార్చు' అంటాడు. ఇదిలా వుంటే ఆటో రెన్యువల్ కోసం వెళ్లిన జ్వాల, హిమ పోలీసులకు అడ్డంగా దొరికిపోతారు. ఆ తరువాత ఏం జరిగింది?.. వీళ్ల కోసం నిరుపమ్ ఏం చేశాడు అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.