English | Telugu

శేఖర్ బాషా కామెడీ నామినేషన్.. మణికంఠకి రాడ్ దింపాడుగా!

బిగ్‌బాస్ సీజన్ 8లో తొలి నామినేషన్ల ప్రక్రియ షురూ అయిపోయింది. వచ్చిన రెండు రోజులకే హౌస్‌లో ఉండటానికి ఎవరు అనర్హులో డిసైడ్ చేసి నామినేట్ చేసేయండి అంటూ ఎప్పటిలానే బిగ్‌బాస్ చెప్పాడు. దీనికి ఎగబడి మరీ నామినేషన్లు వేసి తన్నుకున్నారు.

నాగ మణికంఠ, బేబక్కలని శేఖర్‌ బాషా నామినేట్ చేశాడు. బేబక్కని నామినేట్ చేసి.. కిచెన్ లో వంట గురించి కారణం చెప్పాడు. అది అందరిది. మీరు కంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు.. సీత ఎగ్ బుజ్జి చేసుకోవాలని వచ్చింది కానీ మీరు ఒక్కటే కర్రీ, ఒక్కటే గ్యాస్ అన్నట్టు మాట్లాడారు. రూల్ బుక్ మొత్తం చదివాను.‌. బిగ్ బాస్ అలా ఏం రూల్ పెట్టలేదు.. మిమ్మల్ని ఎవరైనా కంట్రోల్ చేస్తున్నారో నాకు తెలియదు.‌ కానీ అంత స్ట్రిక్ట్ గా ఉండటం కరెక్ట్ కాదు.. అలా చేయడం నాకు నచ్చలేదు.. అందుకే నామినేట్ చేస్తున్నానని బేబక్కని నామినేట్ చేశాడు శేఖర్ బాషా. ఆ తర్వాత నాగ మణికంఠను నామినేట్ చేశాడు శేఖర్ బాషా. చీఫ్‌లుగా వాళ్లు ఫిట్ కాదంటూ మణికంఠ ఓపెన్‌గా చెప్పడం తనకి నచ్చలేదంటూ కారణం చెప్పాడు. దానికి నాగ మణికంఠ బదులిస్తూ.‌‌. మీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదని నాకు అర్థమవుతుంది ఒకేనా అని అనగానే.. ఒకేనా అంటే ఒకే కాదు అని శేఖర్ బాషా అనేసాడు. దీంతో అందరు ఒక్కసారిగా నవ్వేసారు.

శేఖర్ బాషా నామినేట్ చేసిన మణికంఠ, బేబక్కల్లో.. మణికంఠను సెలక్ట్ చేసి బేబక్కను సేవ్ చేసింది చీఫ్ నైనిక. ఎందుకంటే అది కిచెన్ ప్రాబ్లమ్ .. మాతో బేబక్క డిస్కస్ చేసింది. అందుకే తనని సేవ్ చేశానంటూ నైనిక చెప్పేసింది.‌ ఇక మధ్యమధ్యలో శేఖర్ బాషా నాన్ సింక్ పంచులు నవ్విస్తున్నాయి.‌ ఇక శేఖర్ వేసిన అర్థం కానీ గజిబిజి ప్రశ్నలని మీమ్స్, ట్రోల్స్ లో వాడేస్తున్నారు. దీంతో హౌస్ లో యాక్టివ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లో శేఖర్ బాషా ఒకడిగా నిలిచాడు. మరి మీకు ఏ కంటెస్టెంట్స్ యాక్టివ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి.