English | Telugu

ష‌న్ను, దీప్తి ఇలా.. సిరి, శ్రీ‌హాన్ అలా..

బిగ్‌ బాస్ సీజ‌న్ 5లో సిరి హ‌న్మంత్‌, ష‌ణ్ముఖ్ జ‌స్వంత్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. జెస్సీ హెల్త్ కార‌ణాల వ‌ల్ల హౌస్ నుంచి బ‌య‌టికి వెళ్లిపోవ‌డంతో సిరి, ష‌న్నుల ఎపిసోడ్ ప‌రాకాష్ట‌కు చేరింది. ఊ అంటే హ‌గ్గులు.. ఆ అంటే హ‌గ్గులు.. ముద్దులు.. ఒక ద‌శ‌లో వీరి హ‌గ్గులు చూడ‌లేక జ‌నాల‌కే వెగ‌టు పుట్టేసింది. అంతలా వీరి హ‌గ్గుల పురాణం న‌డిచింది. అయితే అదే ఇప్పుడు ష‌న్ను పాలిట విల‌న్ గా మారి త‌న నుంచి దీప్తి విడిపోయేలా చేసింది. ఇటీవ‌ల దీప్తి త‌ను ష‌న్నుతో విడిపోతున్న‌ట్టు ప్ర‌క‌టించి షాకిచ్చిన విష‌యం తెలిసిందే.

Also read:వంట‌ల‌క్క మ‌రిదిని బుట్ట‌లో వేసిన మోనిత‌

తాజాగా లైవ్ లో కొచ్చిన దీప్తి త‌న‌ని ష‌న్ను గురించి అడిగే స‌రికి ఒక్క‌సారిగా ఎమోష‌న‌ల్ అయిపోయింది. భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేక లైవ్ లో నుంచి ఏడుస్తూనే వెళ్లిపోయింది. ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూసిన వారంతా సిరిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సిరి హౌస్ లో త‌న‌ని తాను కాపాడుకోవ‌డం కోస‌మే ష‌న్నుతో హ‌గ్గుల డ్రామా ఆడింద‌ని, ఇప్ప‌డు అదే ష‌న్ను, దీప్తిల బ్రేక‌ప్ కు కార‌ణంగా మారింద‌ని మండిప‌డుతున్నారు.

Also read:సిరి, ష‌ణ్ణు తెలిసే చేశారు.. మాన‌స్ బ‌య‌ట‌పెట్టేశాడు!

ఈ కామెంట్ ల నేప‌థ్యంలో సిరికి ఆమె ప్రియుడు శ్రీ‌హాన్ కూడా బ్రేక‌ప్ చెప్పేస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ అనూహ్యంగా శ్రీ‌హాన్ మాత్రం సిరికి స‌పోర్ట్ గా నిల‌వ‌డ‌మే కాకుండా ఆమెకు బ‌ర్త్ డే స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఇన్ స్టా స్టోరీస్ లో.. సిరికి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌జేస్తూ శ్రీ‌హాన్‌ ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ ని షేర్ చేశాడు. ఈ ఏడాది నీకు అన్నీ శుభాలే క‌ల‌గాలంటూ శుభాకాంక్ష‌లు అంద‌జేశాడు. అయితే శ్రీ‌హాన్ పోస్ట్ పై సిరి ఏమాత్రం స్పందించ‌కపోవ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒక వైపు ష‌న్ను, దీప్తి బ్రేక‌ప్ తో విడిపోతే సిరికి శ్రీ‌హాన్ బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌డం.. దానికి సిరి నుంచి ఎలాంటి రిప్లై రాక‌పోవ‌డం పలు అనుమానాల‌కి తావిస్తోంద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.