English | Telugu
మహేష్ వాయిస్ ని ఇమిటేట్ చేసిన నాటీ నరేష్.. వార్నింగ్ ఇచ్చిన నెటిజన్స్!
Updated : Aug 23, 2023
ఎక్స్ట్రా జబర్దస్త్ రాబోయే వారం స్కిట్ మాత్రం చాలా ఫన్నీగా ఉండబోతోంది. ఐతే ఈ మధ్య కొన్ని వారాల నుంచి మాత్రం అస్సలు స్కిట్స్ కాదు కదా ప్రోమోస్ కూడా బాగుండడం లేదనే విషయం పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ వారం ప్రసారం కాబోయే స్కిట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో నెటిజన్స్ చెప్పినట్టే స్కిట్స్ లో కంటెంట్ కూడా పెద్దగా ఉండడం లేదు. ఐతే భాస్కర్, నాటీ నరేష్ స్కిట్ కలిసి "పోకిరి" మూవీ బిట్ ని స్పూఫ్ గా చేశారు. అందులో నాటీ నరేష్ మహేష్ బాబు రన్నింగ్ స్టైల్ ని అలాగే ఆయన వాయిస్ ని ఇమిటేట్ చేసాడు. భాస్కర్ కి నరేష్ మాట్లాడిన వాయిస్ ఎవరిదో అనేది అర్ధం కాకా అడిగేసరికి మహేష్ బాబుది అని చెప్పాడు నరేష్. దాంతో భాస్కర్ షాకయ్యాడు.
కానీ నెటిజన్స్ మాత్రం ఫుల్ వార్నింగ్ ఇచ్చిపడేశారు. "భాస్కర్ కొత్తగా ట్రై చెయ్యి.. ఎప్పుడూ మూవీ స్పూఫ్స్ చేస్తావా ...నరేష్ వాయిస్ ఇమిటేట్ చేయడం రాకపోతే చేయకు అంతే కానీ ఇలా చేస్తే బాగోదు...మహేష్ బాబు వాయిస్ ని ఇమిటేట్ చేస్తావా..మాములుగా ఉండదు" అంటూ ఫుల్ వార్నింగ్ ఇచ్చేసారు. ఈ మధ్య జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ స్కిట్స్ లో స్పూఫ్స్ బాగా ఎక్కువైపోయాయి. అందులో వచ్చేది నిజంగానే కామెడీనా కాదా అని కూడా తెలియకుండా జడ్జెస్ పడీపడీ నవ్వేస్తున్నారు. కానీ నెటిజన్స్ మాత్రం ఊరుకుంటారా. గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. జబర్దస్త్ భాస్కర్ కి నాటీ నరేష్ అంటే చాలా ఇష్టం. నరేష్ వల్ల తన స్కిట్స్ బాగా పేలుతుంటాయని చెప్తాడు. నరేష్ వల్లే తమ టీంకు మంచి పేరొచ్చిందని చెప్తుంటాడు..ఐతే నరేష్ మాత్రం ఒక్క టీమ్ అనే కాకుండా స్టాండ్ బైగా అందరి టీమ్స్ లో కనిపిస్తూ అన్ని టీమ్స్ కి సమన్యాయం చేస్తూ ఉంటాడు.