English | Telugu

తన భార్య కవితకు సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ఆదిరెడ్డి!


బిగ్ బాస్ సీజన్ -6 తో ఫేమ్ లోకి వచ్చిన వాళ్ళలో అదిరెడ్డి ఒకడు.. తనకంటూ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుని.. ఎప్పటికికప్పుడు వార్తల్లో నిలుస్తున్నాడు. మొదట రివ్యూ యర్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసి.. ఏకంగా బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసాడు. ఆదిరెడ్డి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫ్యామిలీ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడల్లా తన భార్య కవిత గురించి గొప్పగా చెప్తూ ఉండేవాడు. అయితే ఒకరకంగా తను బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి కారణం కూడా కవితనే అంటూ చాలా సందర్భాలలో చెప్పాడు.. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆదిరెడ్డి చూపించే ఫ్యామిలీ ఎమోషన్ కు ఆ షో చూసే ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు.

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన ఆదిరెడ్డి జనాలకు ఎంత తెలుసో బయట ఉన్న కవిత కూడా అంతగా జనాలకు తెలిసిపోయి తను కూడా ఫేమ్ సంపాదించుకుంది. ఆదిరెడ్డి తన యూట్యూబ్ ఛానల్ లో ఫ్యామిలీ విషయాలు అన్నీ షేర్ చేస్తుంటాడు. రెండు రోజుల క్రితం తన యూట్యూబ్ ఛానెల్ నాలుగు లక్షల సబ్ స్క్రైబర్స్ కి రీచ్ అయినందుకు గాను హైదరాబాదులోని ఒక ఓల్డేజీ హోంలో సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.. కాగా ఇప్పుడు తాజాగా తన భార్య కవితకి సర్ ప్రైజ్ ఇచ్చాడు. తనకు ఇష్టమైన స్కూటీని.. ఆమెకు తెలియకుండా కొని సర్ ప్రైజ్ ఇచ్చాడు. అది చూసిన కవిత థ్రిల్ ఫీల్ అయింది. "ఇంకా షాక్ లోనే ఉన్నాను.. అస్సలు ఊహించనేలేదు. థాంక్స్ ఆది" అంటూ కవిత ఎమోషనల్ అయింది. ఆ తర్వాత మొదటగా ఆదిరెడ్డిని ఎక్కించుకొని డ్రైవ్ చేసింది కవిత. ఇదంతా కెమెరాలో రికార్డ్ చేసి ఆ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ పేజీలోను, యూట్యూబ్ ఛానెల్ లోను పెట్టాడు. కాగా ఈ వీడియోని చూసిన నెటిజన్లు తమ కామెంట్స్ తో అభినందనలు తెలుపుతున్నారు.

ఆదిరెడ్డి ఎప్పటికప్పుడు కొత్తగా ప్లాన్ చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. సోషల్ మీడియా లో యాక్డివ్ గా ఉంటున్న కవిత, ఆదిరెడ్డి మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకుంటున్నారు. ఈ దంపతులు బయట సమాజంలో సోషల్ సర్వీస్ చేస్తూ అందరిచేత ప్రశంసలు అందుకోగా. తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంటున్నారు ఆదిరెడ్డి ఫ్యామిలీ.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.