English | Telugu

మ‌హిళ‌ల‌కోసం స్పెష‌ల్‌గా చెప్పిన సుష్మిత‌

మ‌న ద‌గ్గ‌ర సుష్మిత పేరు విన‌గానే అంద‌రికీ సుష్మిత కొణిదెల గుర్తుకొస్తారు. కానీ కొన్నాళ్లుగా ట్రెండింగ్‌లో ఉన్నారు సుష్మిత సేన్‌. రీసెంట్‌గా ఆమెకు హార్ట్ ఎటాక్ వ‌చ్చింది. మాసివ్ హార్ట్ ఎటాక్ వ‌ల్ల గుండెలో 95 శాతం బ్లాకేజ్ ఉన్న‌ట్టు తెలిసింది. వెంట‌నే ఆమెకు యాంజియోప్లాస్ట్ చేశారు. వీట‌న్నిటి గురించి విమెన్స్ డే సంద‌ర్భంగా సుష్మిత వివ‌రంగా రాసుకొచ్చారు. ``అమ్మాయిగా పుట్టినందుకు చాలా ఆనందిస్తుంటాను. అది నాకు గొప్ప ఆశీర్వాదంగా అనిపిస్తుంటుంది. నాలో ఉన్న శ‌క్తిని ప్ర‌తిరోజూ కొలుస్తుంటాను. నేను దానికి మా అని పేరు పెట్టుకున్నాను. దుర్గ‌మ్మ అని పేరు పెట్టుకున్నాను. న‌న్ను నేను గుర్తించుకుని సెల‌బ్రేట్ చేసుకుంటూ ఉంటాను. అలాంటి ప‌వ‌ర్‌కి విమెన్స్ డే శుభాకాంక్ష‌లు చెబుతున్నాను`` అంటూ రాసుకొచ్చారు. అంతే కాదు, నేటి జ‌న‌రేష‌న్ అమ్మాయిల‌కు చాలా స‌ల‌హాలు ఇచ్చారు.

అక్ష‌య్‌కుమార్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీస‌ర్‌గా స్కైఫోర్స్

కాక్‌టైల్‌, హిందీ మీడియం, స్త్రీ వంటి సినిమాలు తీసిన దినేష్ విజ‌న్ అన్నా, అత‌ని బ్యాన‌ర్ మేడోక్ ఫిల్మ్స్ అన్నా ఓ క్రెడిబిలిటీ ఉంది. రాజ్‌కుమార్ రావు, శ్ర‌ద్ధాక‌పూర్‌, కృతిస‌న‌న్ కూడా ఈ బ్యాన‌ర్‌లో ఆల్రెడీ ప‌ని చేశారు. లేటెస్ట్ బ‌జ్ ప్ర‌కారం అక్ష‌య్‌కుమార్ కూడా ఈ బ్యాన‌ర్‌కి ఓకే చెప్పార‌ట‌. ఈ ప్రాజెక్టుకు స్కై ఫోర్స్ అనే టైటిల్ కూడా ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో అక్ష‌య్ కుమార్ ఇండియ‌న్ ఫోర్స్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తార‌ట‌. ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ సాధించిన అతి పెద్ద విజ‌యాన్ని ఆధారంగా చేసుకుని, వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌తో ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఈ ఏడాది మే నుంచి సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది స్కై ఫోర్స్.

శ్ర‌ద్ధ విష‌యంలో ర‌ణ్‌బీర్‌కి ఆలియా కండిష‌న్స్ పెట్టారా?

శ్ర‌ద్ధాక‌పూర్ విష‌యంలో ర‌ణ్‌బీర్‌కి ఆలియా ష‌ర‌తులు విధించారా?  అదే నిజ‌మైతే, ఏమ‌ని అన్నారు? ఏయే విష‌యాల్లో కండిష‌న్స్ పెట్టారు? ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదో హాట్ టాపిక్‌. గ‌తేడాది బ్ర‌హ్మాస్త్ర షూటింగ్ పూర్తికాగానే పెళ్లి చేసుకున్నారు ర‌ణ్‌బీర్ క‌పూర్‌, ఆలియా. ఆ వెంట‌నే ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. వారికి రహా కూడా పుట్టింది. ఇప్పుడు హ్యాపీ పేరెంట్స్ గా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట‌. ఆలియా పోస్ట్ ప్రెగ్నెన్సీ ట్రీట్‌మెంట్‌లో ఉన్నారు. నార్మ‌ల్ ఫిజిక్‌కి రావ‌డం కోసం ఎక్స‌ర్‌సైజులు కూడా  చేస్తున్నారు. ఇటీవ‌లే కశ్మీర్‌కి షూటింగ్ కోసం వెళ్లారు. ర‌ణ్‌బీర్ కూడా షూటింగ్ ప‌నులు చేసుకుంటున్నారు. తూ జూటీ మే మ‌క్క‌ర్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లోనూ బిజీగా పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో ర‌ణ్‌బీర్ క‌పూర్‌తో న‌టించారు శ్ర‌ద్ధాక‌పూర్‌.