English | Telugu

రానా ఫిక్స్ చేసేస్తారంటున్న న‌టి

హీరో రానా క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న వెబ్ సీరీస్ రానానాయుడు. విక్ట‌రీ వెంక‌టేష్ ఈ సీరీస్‌లో కీ రోల్ చేస్తున్నారు. రానాకి జోడీ ప్రియా బెన‌ర్జీ క‌నిపిస్తున్నారు. ఈ వెబ్ సీరీస్ గురించి ప్రియా బెన‌ర్జీ నార్త్ మీడియాతో మాట్లాడారు. ``ఇప్ప‌టిదాకా నెట్‌ఫ్లిక్స్ లో ఇంత డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సీరీస్ రాలేదు. చాలా మాసీగా చేశారు. ఇందులో రానా బాలీవుడ్ సెల‌బ్రిటీల ఇష్యూల‌ను ఫిక్స్ చేసే వ్య‌క్తిగా క‌నిపిస్తారు. నేను ఇందులో సెల‌బ్రిటీగా న‌టించాను. ఈ సీరీస్‌లో నా పేరు మందిర‌. తాను అనుకున్న రేంజ్‌కి చేరుకోవ‌డానికి ఏదైనా చేసే ర‌కం. అలా ఎదిగే క్ర‌మంలో నాకు ఎదురైన సంఘ‌ట‌న‌ల‌ను దారిలో పెట్ట‌డానికి రానా వ‌స్తారు. ఆ త‌ర్వాత ఏమైంది? మేమిద్ద‌రం క‌లిసి ఎలా సాల్వ్ చేశాం అనేది ఆస‌క్తిక‌రం`` అని అన్నారు.

థ్రిల్ల‌ర్ సీరీస్‌ల‌ను ఇష్ట‌ప‌డే వారికి త‌ప్ప‌కుండా రానా నాయుడు న‌చ్చుతుంద‌న్న‌ది ప్రియా చెబుతున్న మాట‌. మార్చి 17న విడుద‌ల కానుంది రానా నాయుడు. సెట్లో ప్ర‌తి ఒక్క‌రూ ఫ్రెండ్లీగా ఉన్నార‌ని, వెంక‌టేష్ పాజిటివ్‌నెస్ గురించి అందరూ క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకుంటుంటే ఆయ‌న్ని క‌ల‌వాల‌ని అనుకున్న‌ట్టు తెలిపారు ప్రియా.

రానా నాయుడు ట్రైల‌ర్ ఇటీవ‌ల ముంబైలో విడుద‌లైంది. ద‌గ్గుబాటి రానా కూడా ఈ సీరీస్‌కి సంబంధించి నార్త్ మీడియాతో ఇంట్ర‌స్టింగ్‌గా మాట్లాడుతున్నారు. అయితే అంత‌క‌న్నా ఇంట్ర‌స్టింగ్ విష‌యం మ‌రొక‌టి నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. రానానాయుడులో జాన్వీ క‌పూర్ ఉన్నార‌న్న‌దే ఆ న్యూస్‌. రానా, జాన్వీ క‌లిసి షూటింగ్ చేసిన స‌న్నివేశాల క్లిప్స్ నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. అయితే అవ‌న్నీ రానా నాయుడు కోస‌మేనా? లేకుంటే వారిద్ద‌రూ క‌లిసి ఏదైనా వెబ్ సీరీస్‌లో న‌టించారా? ఇంకేమైనా ప్లాన్ చేశారా? ఒక‌వేళ రానా నాయుడికి నార్త్ లో జాన్వీ ప్ర‌మోట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అన్న‌ది అంద‌రికీ వ‌స్తున్న డౌట్‌.

ఒక‌వేళ జాన్వీ ఈ సీరీస్‌లో స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా ఉన్నా స‌రే, సౌత్ హీరోల‌తో ఆమె చేసిన ఫ‌స్ట్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. అన్న‌ట్టు, తార‌క్ నెక్స్ట్ సినిమాలో జాన్వీ అనే పేరు ప‌దే ప‌దే వినిపిస్తోంది.