English | Telugu

షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ అక్ష‌య్‌కుమార్‌!

మొన్నామ‌ధ్య విశాల్‌, రీసెంట్‌గా అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఇప్పుడు అక్ష‌య్‌కుమార్‌. ఇంత‌కీ ఏంటి ఈ లిస్టు అని అనుకుంటున్నారా? అక్క‌డికే వ‌స్తున్నాం. రీసెంట్ టైమ్స్ లో షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ హీరోల పేర్లు ఇవి. తాజాగా అక్ష‌య్‌కుమార్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డారు. బడే మియా చోటే మియా సెట్స్ లో ఆయ‌న‌కు ప్ర‌మాదం జ‌రిగింది. అక్ష‌య్‌కుమార్‌, టైగ‌ర్ ష్రాఫ్ హీరోలుగా న‌టిస్తున్న సినిమా బ‌డే మియా చోటే మియా. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం స్కాట్లండ్‌లో జ‌రుగుతోంది. అక్క‌డ యాక్ష‌న్‌ ఎపిసోడ్స్ నిచిత్రీక‌రిస్తున్నారు. ఈ స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మాదంలోనే అక్ష‌య్ గాయ‌ప‌డ్డారు. అలీ అబ్బాస్ జాఫ‌ర్ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది....

కామెడీ సినిమా చేయాల‌ని ఉంద‌న్న సారా అలీ ఖాన్‌

న‌టీన‌టులు చాలా అదృష్ట‌వంతులు. వాళ్ల జీవితాల‌ను వాళ్లు జీవిస్తూనే, జీవితంలో ఎక్క‌డా ప‌రిచ‌యం కూడా లేని వాళ్ల జీవితాలను పోషించే అవ‌కాశం ద‌క్కించుకుంటారు. అలాంటి లైఫ్ నాకు ప‌రిచ‌యం లేక‌పోతే చాలా బోర్ కొట్టేది. సారా అనే ఒకే ఒక లైఫ్‌ని లీడ్ చేయాల్సి వ‌చ్చేది. ఆ ఊహే నాకు న‌చ్చ‌డం లేదు అని అంటున్నారు బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్‌. కేదార్‌నాథ్‌, సింబా, ల‌వ్ ఆజ్ క‌ల్‌, అత్రంగి రే వంటి సినిమాల్లో న‌టించారు సారా అలీ ఖాన్‌. ఆమె న‌టించిన గ్యాస్ లైట్ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. హాట్‌స్టార్‌లో ఈ సినిమా విడుద‌ల‌కు అన్నీ సిద్ధ‌మ‌య్యాయి. ఈ సినిమాలో కంటెంట్ చూసి ఆడియ‌న్స్ ఎలా ఫీల‌వుతారో తెలుసుకోవాల‌ని ఉంద‌ని అంటున్నారు సారా అలీఖాన్‌.

లవ్‌టుడే రీమేక్‌లో ఆమీర్‌ కొడుకు... నిజమెంత?

ఆమీర్‌ఖాన్‌ కుమారుడు జునైద్‌ ఖాన్‌ ఓ రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నారా? తమిళంలో హిట్‌ అయిన లవ్‌ టుడే బాలీవుడ్‌ స్క్రిప్ట్ ఆమీర్‌ఖాన్‌ కోసం సిద్ధమవుతోందా? ఇప్పుడు నార్త్ లో హాట్‌ టాపిక్‌ ఇదే. ఫాంటమ్‌ పిల్మ్స్, సృష్టి ఆర్య కలిసి తెరకెక్కిస్తున్న సినిమాలో హీరోగా ఆమీర్‌ కుమారుడు జునైద్‌ ఫిక్స్ అయ్యారు. జునైద్‌కి ఇటీవల స్క్రిప్ట్ నెరేషన్‌ ఇచ్చారట మేకర్స్. త్వరలోనే అగ్రిమెంట్‌ మీద సంతకాలు చేస్తారట. అంతకు ముందు జరగాల్సిన అన్నీ కార్యక్రమాలను ఫైనలైజ్‌ చేస్తున్నారు. అర్చన కల్పాతి ఈ సినిమా హిందీ రీమేక్‌ గురించి ట్విట్టర్‌లో రాశారు. ఫాంటమ్‌ ఫిల్మ్స్, సృష్టి ఆర్య తో కలిసి ఈ సినిమాను బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నట్టు తెలిపారు. 

హృతిక్ రోష‌న్‌కి చ‌దివే కెపాసిటీ ఉంద‌న్న ద‌ర్శ‌కుడు

ప‌ఠాన్ డైర‌క్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పుడు క్లౌడ్ నైన్‌లో ఉన్నారు. ఇండియాలో ఇప్ప‌టిదాకా వెయ్యి కోట్ల మార్కును దాటిన సినిమాలు ఐదంటే ఐదే. ఇప్పుడు వాటిలో ఒక‌టి ప‌ఠాన్‌. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆనందంగా ప‌రుగులు తీస్తున్నారు సిద్ధార్థ్‌. ఇండియా ఫ‌స్ట్ ఏరియ‌ల్ యాక్ష‌న్ సినిమా అంటూ ఫైట‌ర్ సినిమా ప్ర‌మోష‌న్లు జ‌రుగుతున్నాయి. బ్యాంగ్ బ్యాంగ్‌, వార్ సినిమాల త‌ర్వాత హృతిక్ రోష‌న్‌తో సిద్ధార్థ్ ఆనంద్ రీయూనియ‌న్ అవుతున్న సినిమా ఇది. దీపిక ప‌దుకోన్ నాయిక‌గా న‌టిస్తున్నారు. హృతిక్‌, దీపిక ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న తొలి సినిమా ఇది. హ్యూజ్ స్కేల్ ప్రాజెక్ట్ గా ఇప్ప‌టికే మంచి పేరు తెచ్చుకుంది.