English | Telugu
భోళా మీద అంచనాలు పెంచుతున్న అజయ్!
Updated : Mar 4, 2023
అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన సినిమా భోళా. ఈ సినిమాను త్రీడీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇండియాలో ఫస్ట్ టైమ్ ఈ సినిమా ట్రైలర్‌ని కూడా త్రీడీలో విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో ట్రైలర్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీని గురించి అజయ్ దేవ్‌గణ్ చెబుతూ ``నేను చెప్పడం కాదు, ట్రైలర్ చూసి ఈ సినిమాలో యాక్షన్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. ఆ వైబ్స్ అర్థమైతేనే, నేనేం చెప్పినా వాళ్లకు ఎక్కుతుంది`` అని అన్నారు. ఈ సినిమాలో స్టంట్స్, ఛేజ్‌లు, ఫైట్స్ మరో రేంజ్‌లో ఉంటాయన్నది అజయ్ చెబుతున్న మాట. యాక్షన్‌కి భోళా సరికొత్త నిర్వచనం ఇస్తుందని అంటున్నారు మేకర్స్. ఇంకా చెబుతూ ``మా అప్రోచ్ చాలా `రా` గా సాగింది. రూరల్ ఇండియాలో జరుగుతున్న సినిమా కావడంతో, దానికి తగ్గట్టే యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశాం. రేజర్ షార్ప్ సూపర్ ఫాస్ట్ ఛేజులు ఉంటాయి. చాలా రష్‌గా తీశాం. చాలా కొత్త డైమన్షన్‌లో చేశాం.
మా నాన్నగారు వీరు దేవ్‌గణ్ యాక్షన్ పార్టుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టేవారు. ఆయన దగ్గర నుంచి నాక్కూడా అది అలవాటయింది. అందుకే నేను కూడా చాలెంజ్‌గా తీసుకుని ఈ ఫైట్లు చేశాను`` అని అన్నారు అజయ్. సౌత్‌లో కార్తి హీరోగా లోకేష్ కనగరాజ్ డైరక్ట్ చేసిన సినిమా ఖైదీ. ఈ సినిమాను బేస్ చేసుకుని హిందీలో రూపొందిస్తున్న సినిమా భోళా. ఆల్రెడీ భోళాకు హిందీలో చాలా మంచి క్రేజ్ వచ్చేసింది. ఇక్కడ లోకేష్ సెకండ్ పార్టులో చెప్పాలనుకున్న చాలా విషయాలను అక్కడ డైరక్టర్ ఇంక్లూడ్ కూడా చేసేశారు. అంటే, దీన్ని బట్టి భోళా మూవీ, కార్తీ ఖైదీకి 2.0 వెర్షన్ అన్నమాట. ఏదైనా, ఈ ఇయర్ పఠాన్‌తో షారుఖ్ తెచ్చిన సక్సెస్‌ని భోళా సినిమాతో కంటిన్యూ చేసే తీరాలన్న కసిమీదున్నారు అజయ్. ఆల్రెడీ బెస్ట్ ఫ్రెండ్ షారుఖ్ బెస్ట్ హిట్ ఇచ్చేశారు, ఇప్పుడు భర్త కూడా బాలీవుడ్‌కి మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చేస్తే, తాను సూపర్ హ్యాపీ అంటున్నారు కాజోల్.