English | Telugu

కార్తిక్ - క‌ర‌ణ్ క‌లిసిపోయిన‌ట్టేనా?

కార్తిక్ ఆర్య‌న్‌, క‌ర‌ణ్ జోహార్ ఇద్ద‌రూ క‌లిసిపోయిన‌ట్టేనా?  వారిద్ద‌రి మ‌ధ్య అంతా స‌వ్యంగానే ఉందా? ఇప్పుడు బాలీవుడ్‌లో జ‌రుగుతున్న డిస్క‌ష‌న్ అంతా దీని గురించే. అందుకే వీరిద్ద‌రి పేర్లు హెడ్‌లైన్స్ లో మారుమోగుతున్నాయి. ముంబైలోని ఓ ఖ‌రీదైన భ‌వనం నుంచి కార్తిక్ ఆర్య‌న్‌, క‌ర‌ణ్ జోహార్ బ‌య‌ట‌కు వెళ్ల‌డంతో వారిద్ద‌రి మ‌ధ్య అంతా ప‌ర్ఫెక్ట్ గా ఉంద‌నే మాట‌లు వినిపిస్తున్నాయి. దోస్తానా 2 నుంచి కార్తిక్ ఎగ్జిట్ అయ్యాడ‌నే మాట‌ల‌కు ఇప్పుడు ఫుల్‌స్టాప్ ప‌డ్డ‌ట్ట‌యింది. దోస్తానా 2 ఆగిపోయింద‌ని,క‌ర‌ణ్ జోహార్‌తో చెడ‌టం వ‌ల్ల‌నే ఆ ప్రాజెక్ట్ నుంచి కార్తిక్ త‌ప్పుకున్నార‌ని చాలా వార్త‌లువ‌చ్చాయి. అయితే కార్తిక్‌గానీ, క‌ర‌ణ్‌గానీ దీని గురించి ఎప్పుడూ పెద‌వి విప్ప‌లేదు. అయితే, ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసింది దేనికోసం?  దోస్తానా 2 చేస్తారా?  లేకుంటే, దాన్ని ప‌క్క‌న పెట్టి సరికొత్త ప్రాజెక్టును టేక‌ప్ చేస్తారా? అనేది కూడా ఆలోచించాల్సిన విష‌యం.

షారుఖ్‌కి జరిగింది సల్మాన్‌కి రిపీట్‌ అవుతుందా?

కొన్ని మాటలను తెలిసి అన్నా, తెలియకుండా అన్నా.. అవి జస్ట్ అలా ట్రెండ్‌ అయిపోతుంటాయి. రీసెంట్‌గా షారుఖ్‌ విషయంలోనూ అలాంటిదే జరిగింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్‌ఫుల్‌ప్లెడ్జ్ డ్‌గా స్క్రీన్‌ మీదకు వచ్చారనే ప్రచారం గట్టిగా జరిగింది. నాలుగేళ్ల తర్వాత స్క్రీన్‌ మీదకు వచ్చిన షారుఖ్‌కి పఠాన్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయింది. ఇప్పుడు బాలీవుడ్‌ బాయీజాన్‌ సల్మాన్‌ ఫ్యాన్స్ కూడా అలాంటి లాజిక్కే లాగే ప్రయత్నం చేస్తున్నారు. సల్మాన్‌ భాయ్‌ సినిమా ఈద్‌కి ఫుల్‌ప్లెడ్జ్ డ్‌గా రిలీజ్‌ అయి నాలుగేళ్లయిందనేది అభిమానుల మాట. అంటే షారుఖ్‌కి నాలుగేళ్ల గ్యాప్‌ కలిసొచ్చినట్టు సల్మాన్‌ ఖాన్‌కి కూడా కలిసొస్తుందా? అనే మాటలు వినిపిస్తున్నాయి

సిటాడెల్‌ షూట్లో పాల్గొన్న సమంత

సమంత రూత్‌ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్న సీరీస్‌ సిటాడెల్‌. వరుణ్‌ ధావన్‌ మెయిన్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సీరీస్‌ షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మేడన్‌ నటిస్తున్న సిటాడెల్‌కి ఇండియన్‌ వెర్షన్‌ అది. సమంత, వరుణ్‌ధావన్‌ నటిస్తున్న సీరీస్‌ సెట్స్ నుంచి కొన్ని పిక్స్ ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. సమంత ఫార్మల్‌ ఔట్‌ఫిట్‌లో కనిపించారు. పర్పుల్‌ షర్ట్, డెనిమ్‌ జీన్స్ లో ఉన్నారు సామ్‌. వరుణ్ధావన్‌ బ్రౌన్‌ టీ షర్ట్, జీన్స్ లో కనిపించారు. సమంత ఫేస్‌ సీరియస్‌గా కనిపించింది. డ్రమాటిక్‌ సన్నివేశాన్ని తెరకెక్కిస్తుండవచ్చనే మాటలు వినిపించాయి. వరుణ్‌ ధావన్‌కీ, సమంతకి ఈ సీరీస్‌ విషయంలో ఏమైనా సలహాలిస్తారా? అని ఇటీవల ప్రియాంక చోప్రాను అడిగిత ''వాళ్లిద్దరూ ఎవరికి వారు టాలెంట్‌ ఉన్న వ్యక్తులు. ఇప్పుడు వాళ్లకి నేనేం సలహాలు ఇవ్వగలను. వాళ్లదైన తరహాలో చాలా బాగా చేస్తారని నమ్ముతున్నాను'' అని అన్నారు. రాజ్‌, డీకే సిటాడెల్‌ని తెరకెక్కిస్తున్నారు. గతంలో వీరి డైరక్షన్‌లోనే ఫ్యామిలీ మేన్‌ 2లో రాజీ కేరక్టర్‌ చేశారు సమంత. 

బాజా భ‌జంత్రీలు రెడీయేనా? మ‌ల్లికా అర్జున్ సిద్ధం!

మ‌లైకా అరోరా, అర్జున్ క‌పూర్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. త‌న‌క‌న్నా చిన్న‌వాడిని ప్రేమిస్తూ ఆమె, త‌న‌క‌న్నా పెద్దావిడ‌ను పెళ్లి చేసుకోవ‌డానికి సిద్ధ‌మంటూ అత‌ను, ఎప్ప‌టి నుంచో బాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తూనే ఉన్నారు. ఎయిర్‌పోర్టు లుక్స్ లోనూ, హాలీడే స్పాటుల్లోనూ, రొమాంటిక్ ట్రిప్స్ లోనూ, సోష‌ల్ మీడియా - ప‌బ్లిక్ అప్పియ‌రెన్సుల్లోనూ ఇద్ద‌రూ క‌లిసే మ‌న‌సుల‌ను కొల్ల‌గొట్టేస్తుంటారు. మ‌న‌సుకు న‌చ్చిన‌ట్టు ఉండాలంటారు మ‌లైకా. చెప్ప‌డ‌మే కాదు, చేసి చూపిస్తుంటారు. ఇండ‌స్ట్రీలో పాతికేళ్ల అనుభ‌వం ఆమె సొంతం....

బ్ర‌హ్మాస్త్ర‌కు ఇంకాస్త టైమ్ ప‌డుతుంది!

ర‌ణ్‌బీర్‌, ఆలియా ఇప్పుడు తమ త‌మ ఓన్ ప్రాజెక్టుల మీద ఫోక‌స్ పెంచాల‌నుకుంటున్నారు. వారిద్ద‌రూ క‌లిసి చేసే ప్రాజెక్టుకు ఎక్కువ టైమ్ ప‌డుతుంది కాబ‌ట్టి, ఇండివిజువ‌ల్ ప్రాజెక్టుల కోసం క‌థ‌లు విన‌బోతున్నారు. ర‌హాకు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత ఆలియా షూటింగుల‌కు హాజ‌ర‌వుతున్నారు. ర‌ణ్‌వీర్ సింగ్ హీరోగా ఆలియా ఓ సినిమాలో న‌టిస్తున్నారు. ర‌ణ్‌బీర్‌క‌పూర్ ప్ర‌స్తుతం ర‌ష్మిక‌తో యానిమ‌ల్‌లో న‌టిస్తున్నారు. సందీప్ వంగా ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోంది. రీసెంట్‌గా ర‌ణ్‌బీర్ క‌పూర్ న‌టించిన తూ జూటీ మే మ‌క్క‌ర్ రిలీజ్ అయింది. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కాగానే ర‌ణ్‌బీర్ అండ్ ఆలియా క‌లిసి అయాన్ ముఖ‌ర్జీ సెట్స్ కి హాజ‌ర‌వుతార‌న్న‌ది నిన్న‌టిదాకా అంద‌రి మ‌న‌స్సుల్లో ఉన్న మాట‌. కానీ ఇప్పుడు దానికి ఇంకా టైమ్ ఉంద‌ని ఫిల్మ్ మేక‌ర్ ఓపెన్ లెట‌ర్ రాసేశారు.

క‌రీనా క‌పూర్ స్టైల్ గురించి కొడుకు ఏమ‌న్నాడో విన్నారా?

ఇప్ప‌టికీ బాలీవుడ్‌లో స్టైలిష్ న‌టీమ‌ణుల గురించి మాట్లాడుకోవాల్సి వ‌స్తే క‌రీనాక‌పూర్ ఖాన్ పేరును అస‌లు విడిచిపెట్ట‌లేం. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త స్టైల్స్ తో జ‌నాల‌ను వావ్ అనిపిస్తూనే ఉంటారు క‌రీనా. రెడ్ కార్పెట్ ఈవెంట్ అయినా, కేజువ‌ల్ ఔటింగ్ అయినా బెబో ఎప్పుడూ గ్లామ‌ర‌స్‌గానే క‌నిపిస్తుంటారు. ఆమె డ్ర‌స్సింగ్ సెన్స్ గురించి ఆమె కొడుకులు జె, తైమూర్ ఎప్పుడైనా ఏమైనా చెప్పారా అని క‌రీనాని అడిగితే గ‌ట్టిగా న‌వ్వేశారు. దీని గురించి మాట్లాడుతూ ``జెహంగీర్ అలీ ఖాన్‌, తైమూర్ ఇద్ద‌రూ చాలా చిన్న పిల్ల‌లు. వాళ్ల‌కు ఇంకా స్టైల్ గురించి తెలియ‌డం లేదు. జెహంగీర్‌కి కూడా వాటి గురించి అవేర్‌నెస్ లేదు`` అని అన్నారు. క‌రీనాక‌పూర్ త‌న స్టైల్ కోసం, కావాల్సినంత టైమ్‌ని స్పెండ్ చేస్తారా అని అడిగితే ``ఎందుకు చేయ‌ను?  త‌ప్ప‌కుండా చేస్తాను. కానీ అదేదో ప్ర‌త్యేకంగా చేసిన‌ట్టు ఉండ‌దు. అలాగ‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ట్రెండ్‌లో ఉండాల‌ని తాప‌త్ర‌య‌ప‌డ‌ను. చాలా కేజువ‌ల్‌గా ఉంటాం. నేనన్నా అప్పుడ‌ప్పుడూ ట్రెండ్‌ని ప‌ట్టించుకుంటాను. సైఫ్ అయితే ఐదేళ్లుగా ఒకే ట్రాక్ ప్యాంట్స్ ని వాడుతున్నారు. దీన్ని ఎన్నేళ్లుగా వాడుతున్నారో గుర్తుందా అని నేను ప‌నిగ‌ట్టుకుని గుర్తుచేసేదాకా ఆయ‌న ఇంకో పెయిర్ తీసుకోరు`` అని అన్నారు. 

పాత క‌థ‌ల మీద బాలీవుడ్ ఫోక‌స్‌

ఆగ‌డం గొప్పా?  సాగ‌డం గొప్పా? ఎప్ప‌టిక‌య్య‌ది ప్ర‌స్తుతం ఆ క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుని స‌క్సెస్ కొట్ట‌డ‌మే సినీ నీతి సుమ‌తి అని అంటోంది బాలీవుడ్‌. ఇప్పుడు సాగుతున్న కాలం కాబ‌ట్టి, గ‌తంలో హిట్ అయిన సినిమాల‌ను కొన‌సాగించాల‌నే ఆలోచ‌న‌తో ఉంది. త్రీ ఇడియ‌ట్స్, మ‌ర్దాని 3, డాన్ 3 సినిమాల‌ను తెర‌కెక్కించాల‌న్న‌ది మేక‌ర్స్ సంక‌ల్పం. యాక్ష‌న్ ఫ్రాంఛైజీలు, కామెడీ ఫ్రాంఛైజీలు, హార‌ర్ కామెడీలు రాజ్య‌మేలుతున్న కాలం ఇది. అందుకే ర‌క‌ర‌కాల సినిమాల‌కు సీక్వెల్స్ ప్ర‌క‌టిస్తున్నారు. వాటిల్లో ఇప్ప‌టికీ అఫిషియ‌ల్‌గా ప్ర‌క‌టించ‌క‌పోయినా, ప్ర‌జ‌ల మ‌న‌సులు దోచుకుంటున్న సినిమాల పేర్లు కొన్ని ఉన్నాయి. వాటిలో త్రీ ఇడియ‌ట్స్, మ‌ర్దాని 3, డాన్  3 మెయిన్‌గా చెప్పుకోవాల్సిన సినిమాలు.