English | Telugu

బిగ్ బాస్‌లో జూనియర్ రాకేష్ మాస్టర్.. షాక్‌లో హౌస్‌మెట్స్!

బిగ్ బాస్ హౌస్ రోజు రోజుకి కొత్తగా మారుతుంది. కంటెస్టెంట్స్ ఎవరి గేమ్ వారు ఆడుతూ ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతున్నారు.  శని, ఆదివారం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సోమవారం నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని అందరికి తెలిసిందే. అయితే నామినేషన్లలో హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. గతవారం 2.0 గ్రాంఢ్ ఎంట్రీ లో వచ్చిన కొత్త కంటెస్టెంట్స్ అశ్విని, భోలే షావలికి నామినేషన్లు ఎక్కువగా పడ్డాయి. నామినేషన్లు ఎక్కువగా పడేసరికి ఎంతో కూల్‌గా వుండే భోలే షావలిలోని మరో వ్యక్తి బయటకు వచ్చాడు. తనలోని బాధను మర్చిపోతూనే.. తనకు నామినేషన్స్ పడుతున్న ప్రతీ సారి తన కామెడీతో ప్రేక్షకులను అలరించాడు. ఈ కామెడీ చూస్తున్న ప్రేక్షకులు తన బాడీ ల్యాంగ్వేజ్ మరియు తన మాటతీరు అచ్చం రాకేష్ మాస్టర్‌ల వున్నాయని గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే.. రాకేష్ మాస్టర్ కూడా తనలోని నటుడ్ని అవసరానికి తగ్గట్టుగా బయటకు తీసుకోస్తూ వుండేవారు.