English | Telugu

హీటెడ్ నామినేషన్లు.. భోలే శావలి, అశ్విని శ్రీ కి ఎక్కువ!

బిగ్ బాస్ హౌస్ లో సోమవారం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. కొత్తగా వచ్చిన హౌజ్ మేట్స్ ని పాతవాళ్ళు టార్గెట్ చేసినట్టుగా అర్థమవుతుంది.

పల్లవి ప్రశాంత్ తన మొదటి నామినేషన్ గా ఆట సందీప్ ని, రెండవ నామినేషన్ గా టేస్టీ తేజని చేశాడు. ఆ తర్వాత ఆట సందీప్ పల్లవి ప్రశాంత్, భోలే శావలిని చేశాడు. భోలే శావలి, అశ్వినిశ్రీలని ప్రియాంక జైన్ నామినేట్ చేసింది‌. పూజామూర్తి అశ్విని శ్రీని నామినేట్ చేసింది. తను గేమ్ ఆడేటప్పుడు గేమ్ మీద ఫోకస్ చేయాలని, నీతో మాట్లాడడం లేదని ఫీల్ అవుతున్నావ్‌.

అది కరెక్ట్ కాదు. నాతో నువ్వు మాట్లాడిన విధానం బాలేదని, అందరు నీతో మాట్లాడాలంటే ముందు నువ్వు వాళ్ళతో ఉండాలని అశ్విని శ్రీతో చెప్పి తనని నామినేట్ చేసింది పూజా మూర్తి. ఇక వీళ్ళిద్దరి ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అయితే ఆ తర్వాత వచ్చి‌న టేస్టీ తేజ తన మొదటి నామినేషన్ గా పూజామూర్తిని చేశాడు. "నేను దుప్పటి కప్పుకొని పడుకుంటే నీళ్లు కొట్టి మరి నిద్ర లేపడం ఎంతవరకు కరెక్ట్. నాకు నెగెటివ్ వైబ్స్ వచ్చాయి. అందుకే నామినేట్ చేస్తున్నాను" అంటూ పూజామూర్తిని నామినేట్ చేశాడు టేస్టీ తేజ. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేశాడు టేస్టీ తేజ.

అశ్విని శ్రీకి ఒకటికి మూడు సార్లు చెప్తే కానీ అర్థం కావడం లేదని అంబటి అర్జున్ తన నామినేట్ పాయింట్ ని చెప్పి నామినేషన్ ప్రారంభించాడు. నన్ను అసలు గేమ్ ఆడనిస్తే కదా నువ్వు, ఎప్పుడైనా గేమ్ ఇది ఇలా ఆడాలి అని మాట్లాడితే కదా అసలు అంటూ అశ్విని శ్రీ రెచ్చిపోయింది. ఇక ఆ తర్వాత ఆట సందీప్ వర్సెస్ భోలే శావలి, ప్రియాంక జైన్ వర్సెస్ భోలే శావలి, అంబటి అర్జున్ వర్సెస్ భోలే శావలి మధ్య హీటెడ్ ఆర్గుమెంట్ జరిగాయి. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‌లో శోభా శెట్టి వర్సెస్ భోలే శావలి మధ్య నామినేషన్ ఆసక్తిగా మారింది. శోభా శెట్టిని మోనిత అని భోలే శావలి అనడం, దానికి ప్రియంక జైన్, శోభా శెట్టి కలిసి వాగ్వాదానికి దిగడం మరింత ఆసక్తిగా మారింది.