English | Telugu
అప్పు మనసులో కళ్యాణ్.. కావ్యకి దగ్గరవుతున్న రాజ్!
Updated : Oct 18, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -229 లో...దుగ్గిరాల ఇంట్లో అందరు భోజనం చేస్తుంటారు. కనకాన్ని కూడా తమతో కూర్చొని భోజనం చెయ్యమని ఇందిరాదేవి అంటుంది. అక్కడే ఉన్న రుద్రాణి.. కింద కూర్చొని తినమని కనకానికి చెప్పగానే.. అందరు రుద్రాణిపై కోప్పడతారు. ఆ తర్వాత కనకం వాళ్ళతో కలిసి భోజనం చేస్తుంది. ఇప్పుడు కనకం ఎక్కడ పడుకుంటుందని ఇందిరాదేవి అంటుంది. రుద్రాణి గదిలో అని ధాన్యలక్ష్మి చెప్తుంది. అది విన్న రుద్రాణి ఏం అనలేక సైలెంట్ గా ఉంటుంది.
మరొక వైపు అన్నపూర్ణ ఒడిలో పడుకొని అప్పు ఏడుస్తుంటుంది. నువ్వు చెప్పింది నిజమే పెద్దమ్మ.. నేను కళ్యాణ్ ని ప్రేమిస్తున్నాను కానీ వాడికే అర్థం కాలేదు. రోజు నాతో తిరుగుతాడు. నా మనసు అర్థం కాలేదా? అసలు ఇన్ని రోజులు కళ్యాణ్ ని ప్రేమించాలని నేను అనుకోలేదు, అలా జరిగింది. నేను మగరాయుడిని అంట, నాకు మనసు ఉండదంట. తన మాటలు చాలా బాధ కలిగించాయని అన్నపూర్ణకి అప్పు చెప్తు బాధపడుతుంది. మరొక వైపు రాజ్ తన గదిలోకి వస్తాడు. తనతో తనే మాట్లాడుకుంటాడు. కావ్యని ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేస్తున్నావని ఒక వర్షన్ లో, మూడు నెలలు తర్వాత తనెవరో నేనెవరో అని మరొక వర్షన్ లో రాజ్ మాట్లాడతాడు.
మరొక వైపు రుద్రాణి గదిలోకి కనకం వస్తుంది. కృష్ణమూర్తికి కనకం ఫోన్ చేసి మాట్లాడుతుంటే రుద్రాణి చిరాకుగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కనకం ఎలాగైనా గదిలో నుండి వెళ్ళిపోవాలని ఏసీ ఎక్కువ పెడుతుంది రుద్రాణి. మరొక వైపు రాజ్ దగ్గరికి కావ్య వస్తుంది. తనని పట్టించుకోవడం లేదని కావ్య ఫీల్ అవుతుంది. దాంతో రాజ్ ఏం కావాలని అడుగుతాడు.
నాకు ఇప్పుడు ఖిల్లీ తినాలని ఉందని అనగానే సరే వెళదామని కావ్యకి రాజ్ చెప్తాడు. మరొక వైపు కనకానికి బాగా చలి ఉండడంతో బీరువా నుండి రుద్రాణి చీరలు తీసుకొని కప్పుకుంటుంది. అదే సమయంలో బయట ఎవరైనా ఉన్నారేమో అని రాజ్ చూస్తుంటాడు. అప్పుడే కావ్య డ్రెస్ లో వస్తుంది. కావ్యని డ్రెస్ లో చూసిన రాజ్ ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.