English | Telugu

జోర్దార్ సుజాత..కారు యాక్సిడెంట్ అయ్యింది!

ఇప్పుడు ఏం జరిగిన కొందరు నటులు తమ యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేస్తూ ఫేమస్ అవ్వాలని తెగ ట్రై చేస్తున్నారు. చీర కొన్న, కారు కొన్న ఏదీ కొన్న అప్లోడ్ చేసేవాళ్ళున్నారు. కానీ యాక్సిడెంట్ అయిందని చెప్పేవాళ్ళు రేర్ గా ఉంటారు. కార్ కి యాక్సిడెంట్ అయిందని జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానెల్ లోని వ్లాగ్ లో చెప్పుకొచ్చింది.

జోర్దార్ సుజాత.. తన మాటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన క్రేజ్ ని మరింత పెంచుకుంది. తాజాగా విడుదలైన 'సేవ్ ది టైగర్స్' లో నటించి తనలోని మరొక కోణాన్ని తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. జోర్దార్‌ సుజాత తన డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగ రీత్యా హైదరాబాద్ కి వచ్చింది. ఆమె మొదట ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ జాబ్‌లో చేరింది.

ఈ క్రమంలోనే తనకి ఓ ప్రోగ్రామ్ లో తెలంగాణలో మాట్లాడే అవకాశం ఉందని అనడంతో తనకు అదృష్టం కలిసొచ్చింది. అలా తీన్మార్ వార్త‌లు చెప్తూ సుజాత‌గా పరిచయమైంది. ఆ తరువాత జోర్దార్‌ వార్తలతో 'జోర్దార్‌ సుజాత' గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా ఫేమ్ పొందిన తర్వాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అవకాశం వచ్చింది. ఆమె బిగ్‌బాస్‌ నుంచి బయటికొచ్చిన తర్వాత మాటీవీలో 'ఆహారం-ఆరోగ్యం' కార్యక్రమం చేస్తుంది. సుజాత తన యూట్యూబ్ ఛానల్ సూపర్ సుజాత ద్వారా ప్రజలకు మరింత చేరువైంది. అలాగే సుజాత జబర్దస్త్ కామెడీ షోలో రాకింగ్ రాకేష్ టీమ్‌లో నటిస్తుంది. అంతేకాదు ఆమె, రాకింగ్ రాకేష్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కి తమ అప్డేట్స్ ని ఇస్తుంటారు.

సుజాత తాజాగా " కార్ యాక్సిడెంట్ అయింది" అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. కార్ లో వెళ్తున్నప్పుడు ఎదురుగా ఒకతను బైక్ మీద వచ్చి డాష్ ఇచ్చాడని, ఆ కార్ తన ఫేవరెట్ అండ్ లక్కీ కార్ అని సుజాత అంది. అసలు ఇలా జరుగుతుందని తను ఊహించలేదంట. " మేము సీటు బెల్ట్ పెట్టుకున్నాం కాబట్టి మాకు ఏం కాలేదు. పైగా మా కార్ ని గుద్దిన అతనికి హెల్మెట్ లేదు. దయచేసి బండి మీద వెళ్ళేవాళ్ళు హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయండి. కార్ లో వెళ్తున్నవాళ్ళు సీటుబెల్ట్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎంత జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ వెళ్ళిన అవతలి వాళ్ళు అలాగే రావాలని లేదు కదా. మీకోసం మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లో ఎదురుచూస్తుంటారు. జాగ్రత్తగా వెళ్ళండి" అంటూ సుజాత ఈ వ్లాగ్ లో చెప్పుకొచ్చింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.