English | Telugu
తన గొయ్యి తానే తవ్వుకున్న గౌతమ్ కృష్ణ.. కంటెంట్ కోసం అశ్వగంధ అయ్యాడా?
Updated : Oct 18, 2023
బిగ్ బాస్ హౌజ్ లో నామినేషన్ల హావా నడుస్తుంది. ఒక్కో కంటెస్టెంట్ వేసే నామినేషన్లతో ప్రేక్షకుల బుర్రపాడవుతుంది. రెండు రోజులు సాగిన నామినేషన్లో భోలే షావలిని సీరియల్ బ్యాచ్ అంతా టార్గెట్ చేశారని స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా మన కన్నింగ్ అంబటి అర్జున్ వేసిన నామినేషన్ తుప్పాస్ రీజన్ లా అనిపించిందనే చెప్పాలి.
గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ కి వెళ్ళే ముందు బూతులు వాడి అందరి దృష్టిలో బ్యాడ్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ హౌజ్ లోకి వచ్చి శివాజీని నామినేట్ చేశాడు. సీరియల్ బ్యాచ్ తనని నామినేట్ చేసింది పట్టించుకోకుండా వాళ్ళని సపోర్ట్ చేస్తూ శివాజీని నామినేట్ చేసిన గౌతమ్ కృష్ణపై నెటిజన్లు మళ్లీ ట్రోల్స్ మొదలెట్టారు. " వీడు అశ్వత్థామ కాదు అశ్వగంధ " అని గౌతమ్ కృష్ణని ట్రోల్స్ చేస్తున్నారు.
గౌతమ్ లాంటి ఒక అతి తెలివి తక్కువ వాడి వల్ల హౌజ్ లో నాణ్యమైన ఆట ఆడే ఆటగాళ్ళకి, నీతిగా నిజాయితీగా ఆడే వ్యక్తులకు అన్యాయం జరుగుతుందని గతవారం శివాజీ అన్నాడు. ఇప్పుడు అదే చేశాడు గౌతమ్. గౌతమ్ ని బయటకు పంపడానికి శోభా శెట్టి, ప్రియాంక జైన్.. సీరియల్ బ్యాచ్ అంతా కారకులే కానీ గౌతమ్ మాత్రం శివాజీని టార్గెట్ చేసి నామినేట్ చేశాడు.
ఇప్పటివరకు జరిగిన టాస్క్ లలో గౌతమ్ కృష్ణ జీరో పర్ఫామెన్స్ ఇచ్చాడు కానీ గతవారం శుభశ్రీ వల్ల బ్రతికిపోయాడు. ఆ తర్వాత సందీప్ ప్లే చేసిన స్ట్రాటజీలో అతను బలి అయ్యాడు. అయితే ఎవరు ఫేక్? ఎవరేం ఏం మాట్లాడుతున్నారో ఇంకా అర్థం కానీ గౌతమ్ కృష్ణ లాంటి వాడి వల్ల హౌజ్ లోని మిగతా వాళ్ళకి అన్యాయం జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ వారం నామినేషన్ల ఉన్న గౌతమ్ కృష్ణ వెళ్ళిపోతాడా చూడాలి మరి.