English | Telugu
ఎండీగా తొలి సంతకం చేసిన వసుధార!
Updated : Oct 18, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -896 లో.. మహేంద్రని అవమానించారని రిషి కోపంగా ఇంటి నుండి బయటకు వచ్చేస్తాడు. మహేంద్ర గురించి రిషి బాధపడుతుంటే వసుధార వచ్చి ఓదారుస్తుంది. నేను మా డాడ్, పెద్ద డాడ్ ని విడదీసానా అని వసుధారని రిషి అడుగుగా.. మీరేం బాధపడకండి కేవలం కొద్దిరోజులు మాత్రమే ఇదంతా, మహేంద్ర సర్ మంచి కోసమే కదా అని వసుధార చెప్తుంది.
ఆ తర్వాత వసుధార కాఫీ పెడుతుంది. అప్పుడే వసుధార దగ్గరికి రిషి వచ్చి ఏమైనా హెల్ప్ చెయ్యాలా అని అడుగుతాడు. నేనేం వంట చేయడం లేదు. కేవలం కాఫీ మాత్రమే పెడుతున్నానని వసుధార అనగానే అయితే నేను వెళ్తున్నానని రిషి అంటాడు. మీరు ఇక్కడే ఉండండి హెల్ప్ చేయకున్నా, మీరు నా పక్కనే ఉండాలని వసుధార చెప్తుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి కాఫీ కప్ ఇంకా సాసర్ లో పోసుకుని తాగుతారు. ఈ క్షణం నా కల నిజం అయిందని వసుధార తన మనసులో అనుకుంటుంది. వసుధార మనసులో అనుకున్న మాటని రిషి బయటకు చెప్తాడు. ఇక నుండి ఎండీగా కాలేజీనీ ముందుకు నడిపించాలని వసుధారకి రిషి చెప్తాడు. ఈ రోజు మీరు నాతో పాటు కాలేజీ కీ వస్తున్నట్లే కదా అని రిషిని వసుధార అడుగుతుంది. ఈ ఒక్క రోజుకి మాత్రమే వస్తానని రిషి అంటాడు.
మరుసటి రోజు ఉదయం రిషి, వసుధారలు కాలేజీకీ వెళ్తారు. దేవయాని, శైలేంద్ర వాళ్ళ దగ్గరికి వచ్చి రమ్మంటావా అని రిషి ఎందుకు అని అడుగుతారు. ఏం లేదు వసుధార ఎండీగా బోర్డు మెంబెర్స్ అందరు కలిసి సంతకం చేశారు. కానీ మీరిద్దరు మాత్రమే చెయ్యలేదు. ఇప్పుడు చెయ్యండని రిషి డ్యాక్యుమెంట్స్ వాళ్ళ చేతికి ఇస్తాడు. ఇద్దరు ఇబ్బందిగానే సంతకం చేస్తారు. ఆ తర్వాత వసుధారని సంతకం చేయని రిషి అంటాడు. వసుధార కొంచెం సేపు ఆలోచిస్తుంది. మేడమ్ రికమెండ్ తో ఈ కాలేజీ లో అడుగుపెట్టాను. ఇప్పుడు ఈ కాలేజీ ఎండీ అని చెప్తుంది. ఆ తర్వాత వసుధార ఎండీగా సంతకం పెడుతుంది. ఆ తర్వాత వసుధార, రిషి లు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.